![Naga chaitanya Video Goes Viral On Social Media About Web Series - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/17/naga-chaitanya.jpg.webp?itok=40l1OaDz)
యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ మత్య్సకారుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జోరుగా సాగుతోంది.
అయితే ఇదిలా ఉండగా.. గతేడాది నాగ చైతన్య ఓటీటీలోను ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైతూ ప్రధాన పాత్రలో దూత అనే వెబ్ సిరీస్ వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే దూత వెబ్ సిరీస్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. దూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా నాగ చైతన్య వీడియోను అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది. ఆ వీడియోలో నాగచైతన్య చదువుతున్న న్యూస్ పేపర్‌లో మార్చి 19 అని రాసి ఉంది. దీంతో అదే రోజున దూత సీజన్-2 అప్‌డేట్ అదే రోజున రానుందని అర్థమవుతోంది. ఇంకా కన్‍ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మార్చి 19న.. మీరు రెడీనా? అని నాగచైతన్య అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ముఖ్యంగా దూత వెబ్ సిరీస్‍లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్‌తో చైతూ కనిపించడంతో సీజన్ 2 గురించే నని క్లారిటీ ఇచ్చినట్లు ఉంది. మార్చి 19న ఈ రెండో సీజన్‍కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారిక ప్రకటన చేసేలా కనిపిస్తోంది. దీనిపై ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ రోజు వరకు వేచి చూడాల్సిందే.
Are you ready
Are you ready
Are you ready
𝟏𝟗 𝐌𝐚𝐫𝐜𝐡 ✅
Em plan chesav mawa @PrimeVideoIN...?🤔@chay_akkineni || #NagaChaitanya pic.twitter.com/kLEJ6jg3Rh— ChayAkkineni ™ 🏹 (@MassChayCults) March 17, 2024
Comments
Please login to add a commentAdd a comment