ఓటీటీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ తెలుగు వెబ్ సిరీస్‌ ఏదో తెలుసా! | Akkineni Naga Chaitany Web Series Gets Most Successful In Telugu | Sakshi
Sakshi News home page

ఆ ఓటీటీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ తెలుగు వెబ్ సిరీస్‌.. ఆ స్టార్ హీరోదే!

Published Tue, Mar 19 2024 3:54 PM | Last Updated on Tue, Mar 19 2024 4:18 PM

Akkineni Naga Chaitany Web Series Gets Most Successful In Telugu - Sakshi

ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెద్ద పెద్ద స్టార్స్ సైతం ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. గతేడాది నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ దూత. ఈ వెబ్ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్‌ 1న స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్‌లుగా వచ్చిన ఈ సిరీస్‌ను శరద్‌ మరార్‌ నిర్మించారు. ఈ సిరీస్‌కు విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్‌, ప్రాచీ దేశాయ్‌, తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సిరీస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తెలుగులో అత్యంత సక్సెస్‌ఫుల్‌గా నిలిచిన వెబ్ సిరీస్‌గా ఘనతను సొంతం చేసుకుంది. ఇవాళ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రజెంట్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదికపై నాగచైతన్యతో పాటు ఈ సిరీస్ దర్శక, నిర్మాతలు కూడా పాల్గొన్నారు. కాగా.. ఇటీవలే ఈనెల  19న దూత సీజన్‌-2 గురించి హింట్‌ ఇచ్చారు నాగచైతన్య. కానీ అప్‌డేట్ అయితే రాలేదు.. దూత సిరీస్‌ మాత్రం అమెజాన్ ‍ప్రైమ్‌లో తెలుగు సక్సెస్‌ఫుల్‌ ఒరిజినల్ వెబ్‌ సిరీస్‌గా నిలిచింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement