
హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో అగ్ర కథానాయకిగా రాణించిన ఈమె సినీ, వ్యక్తిగత జీవితాలు రెండు సంచలనమే. టాలీవుడ్ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. అదే విధంగా కథానాయకిగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సిటాడెల్ ఇండియన్ వర్షన్‌లో కనిపించనుంది.
అయితే తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఈవెంట్‌లో సందడి చేసింది సామ్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధింటిన వివరాలను ఈ గ్రాండ్ ఈవెంట్లో వెల్లడించింది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన సిటాడెల్ సిరీస్ కూడా ఉంది. తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ పేరును కూడా మార్చేశారు. సిటాడెల్: హనీ బన్నీ పేరును ఖరారు చేశారు. సిటాడెల్ యూనివర్స్‌లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్ అనే క్యాప్షన్‌తో సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
అయితే ఊహించని విధంగా ఈ ఈవెంట్‌లో అక్కినేని హీరో నాగచైతన్య కూడా సందడి చేశారు. గతేడాది తాను నటించిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూత సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈవెంట్‌లో వెబ్ సిరీస్ టీమ్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్ట్ చేసింది. తెలుగు మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా దూత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
అయితే చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్‌లో కనిపించారు. విడిపోయాక వీరిద్దరు కలిసి ఈవెంట్స్‌లో కనిపించడం చాలా అరుదు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు సమాచారం. కానీ చాలా రోజుల తర్వాత ఓకే ఈవెంట్‌లో ఈ జంట మెరిసింది. అయితే ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్‌లో భాగంగానే ఈవెంట్‌కు హాజరయ్యారు. విడివిడిగానైనా చై- సామ్ ఓ ఈవెంట్‌కు హాజరు కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
our homegrown spy 🔎 #SamanthaRuthPrabhu #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Cd8U5RE5df
— prime video IN (@PrimeVideoIN) March 19, 2024
Celebrating #DhoothaOnPrime - Our most successful Telugu Original series.#AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/PeZ6I8bZlb
— prime video IN (@PrimeVideoIN) March 19, 2024