
మేనమామ వెంకటేశ్, బావ రానాలానే నాగచైతన్య కూడా ఓటీటీకి సై అన్నారు. ‘దూత’ అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీకి ఎంట్రీ ఇస్తున్నారు చైతూ. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది.
ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. కాగా అక్కినేని కుటుంబంతో ‘మనం’లాంటి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్ ‘దూత’లో నాగచైతన్యను డిఫరెంట్ లుక్‌లో చూపించనున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment