డైరెక్ట్‌గా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Sobhita Dhulipala Latest Movie Love Sitara Directly Releasing In OTT On This Date, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: నేరుగా ఓటీటీకి శోభిత ధూళిపాళ్ల మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published Tue, Sep 10 2024 6:27 PM | Last Updated on Tue, Sep 10 2024 7:00 PM

Sobhita Dhulipala Latest Movie Directly Streaming On This OTT From This Date

అక్కినేని హీరో నాగచైతన్యతో ఇటీవలే ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న శోభిత ధూళిపాళ్ల నటించిన తాజా చిత్రం 'లవ్‌, సితార'. ఈ సినిమాను వందన కటారియా దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పెషల్ పోస్టర్‌ను పంచుకున్నారు.

చైతూతో ఎంగేజ్‌మెంట్‌

టాలీవుడ్‌ హీరో, యువసామ్రాట్‌ అక్కినేని నాగతచైతన్యతో శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆగస్టు 8న హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో కొద్దిమంది సన్నిహితుల సమంక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ విషయాన్ని హీరో నాగార్జున అధికారికంగా ట్విటర్‌లో పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement