‘మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’.ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’టీమ్ ఇటలీలో వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకొచ్చింది. ఇలాంటి రిస్క్ టైంలో కూడా థాంక్యూ టీమ్ షూటింగ్ పూర్తి చేసుకొని రావడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పడిన కష్టాలను బయట పెట్టింది రాశిఖన్నా.
కరోనా భయానికి ఇండియా నుంచి ఇటలీకి వెళ్లాలంటే భయమేసింది కానీ, సినిమా కంప్లీట్ చేయాలి కాబట్టి భయంతోనే ఇటలీకి వెళ్లాలని చెప్పింది. భయం భయంగానే షూటింగ్ పూర్తి చేశామని తెలిపింది. షూటింగ్ త్వరగా ముగించేందుకు రోజుకు 18 గంటలు కష్టపడిన సందర్భాలు ఉన్నాయని రాశి చెప్పు కొచ్చింది. కొంచెం కష్టమైనా.. మొత్తనాకి షూటింగ్ పూర్తి చేసుకొని రావడం సంతోషంగా ఉందని రాశి పేర్కొంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో అవికా గోర్ కనిపిస్తారని సమాచారం.
చదవండి :
ప్రీ లుక్‌తోనే షాకిస్తున్న అల్లు శిరీష్.. అస్సలు తగ్గట్లేదుగా
ఇతిహాసాల నేపథ్యంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ, టైటిల్ ఖరారు
Comments
Please login to add a commentAdd a comment