
కోవిడ్ పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ ‘థ్యాంక్యూ’ చిత్రబృందం ఇటలీలో ల్యాండ్ అయింది. పదిహేను రోజుల షూటింగ్‌ను అక్కడ ప్లాన్ చేశారు. ఇటీవల వైజాగ్‌లో ఒక షెడ్యూల్ జరిగింది. ఇప్పుడు ఇటలీలో జరుగుతున్న షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లోనూ ప్లాన్ చేశారు. ఇటలీలో జోరుగా షూటింగ్ చేస్తున్నారు. మరి.. యూనిట్ ఇటలీ నుంచి వచ్చాక ఇక్కడి పరిస్థితులను బట్టి హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది.
‘మనం’ తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ అవికా గోర్ ఇందులో కీలక పాత్రధారి. ఈ సినిమాలో హీరో మహేశ్‌బాబు అభిమాని పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment