టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు. 'మంచి కంటెంట్‌తో సినిమాలు తీయడంపై మీటింగ్‌లో మాట్లాడుకున్నాం. ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరల అంశంపై చర్చించాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే విషయమై నిర్మాతలందరం మాట్లాడాం. ఓటీటీలో సినిమా విడుదల అనేది 8 వారాల లేక 10 వారాల అనే అంశంపై కూడా చర్చించాం.
చర్చల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. షూటింగ్స్ బంద్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్ వల్ల కథలు రాశారు, వాటిని హీరోలు ఒప్పుకున్నారు. నిర్మాతలు తెరకెక్కించారు. కానీ ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. కరోనా సమయంలో ఆడియెన్స్ చాలా ఎడ్యుకేట్ అయ్యారు. అందుకు తగిన స్థాయిలో సినిమాలు తీస్తేనే మెప్పించగలం' అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
చదవండి:👇
అప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్..!
పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ..
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment