ఫ్యామిలీ స్టార్‌ టైటిల్‌.. విజయ్ దేవరకొండ కోసం కాదు: దిల్ రాజు ఆసక్తకర కామెంట్స్ | Producer Dil Raju Reveals Story Behind Family Star Title - Sakshi
Sakshi News home page

Family Star Movie: ఫ్యామిలీ స్టార్‌ టైటిల్‌ ఎందుకంటే?: దిల్ రాజు ఆన్సర్‌ ఇదే!

Published Fri, Mar 22 2024 9:05 PM | Last Updated on Fri, Mar 22 2024 9:23 PM

Producer Dil Raju Comments On Vijay Devarakonda Family Star Title - Sakshi

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఐడీ, హెల్త్ కార్డ్, డైరీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని రివీల్ చేశారు.  ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్‌గా చూపించేందుకు చేసిన సినిమా కాదని.. ఒక ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్ అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశమని దిల్ రాజు అన్నారు. 

దిల్ రాజు మాట్లాడుతూ..'ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండను స్టార్‌గా చూపించేందుకు చేస్తున్న సినిమా కాదు. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి చెప్పని విషయాన్ని ఈ వేదిక మీద రివీల్ చేస్తున్నా. మీరంతా ఎక్కడో ఉన్న మీ కుటుంబాలను గొప్ప స్థాయిలో నిలబెట్టేందుకు కష్టపడుతున్నారు. ఈ వేదిక మీద ఉన్న ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ఆర్ నారాయణమూర్తి మేమంతా సాధారణ జీవితాలతో మొదలై మా రంగాల్లో కష్టపడి ప్రయోజకులమై పైకి వచ్చాం. మా కుటుంబాలకు ఈ సొసైటీలో ఒక పేరు దక్కేలా చేశాం. అలాంటి వారంతా ఫ్యామిలీ స్టార్స్ అని చెప్పడమే ఫ్యామిలీ స్టార్ కథాంశం' అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement