
మంచు వారసుల వివాదం ఇటీవల ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తన అన్న, మా అధ్యక్షుడు మంచు విష్ణు తన అనుచరులతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇళ్లలోకి వచ్చి ఇలా కొడుతుంటాడు మా వాళ్లను, బంధువులను.. ఇది సిచ్యువేషన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే కాసేపటికే ఆ వీడియోను మనోజ్ డిలిట్ చేయడం గమనార్హం. తండ్రి మోహన్ బాబు సీరియస్ అవ్వడంతో మనోజ్ ఆ వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా వివాదంపై మనోజ్ స్పందించాడు.
ఓ మూవీ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న మనోజ్‌కు అన్న మంచు విష్ణు వీడియోపై స్పందించాల్సిందిగా విలేకర్లు ప్రశ్నించారు. దీనికి మనోజ్ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇది నన్ను అడగకండి. నాకంటే అది మీడియాకే ఎక్కువ తెలుసు. వారినే అడగండి. నన్ను అడగోద్దు’ అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘నాకు సినిమానే లైఫ్, మీరే నా జీవితం. సినిమా లేకపోతే నాకు ఏం లేదు. మళ్లీ వస్తున్నా. వాట్ ద ఫిష్‌తో త్వరలోనే మీ ముందుకు వస్తున్నా. నాకు మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి, ఇటివలె కొత్త జీవితం ప్రారంభించాను. మీ అందరు ఆశీర్వాదించి మాకు సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నా’ అంటూ ముగించాడు.
చదవండి:
మంచు బ్రదర్స్ గొడవలో మూడో వ్యక్తి.. ఎవరీ సారథి? అసలేం జరిగింది..
గర్వంగా ఉంది నాన్న.. తనయుడికి చిరు స్పెషల్ విషెస్
Comments
Please login to add a commentAdd a comment