తెలుగులో పలు సినిమాలతో లేడీ డైరక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నందిని రెడ్డి తీవ్ర విషాదంలో ముగిగిపోయింది. తన సోదరి చనిపోవడంతో ఎమోషనల్ అవుతోంది. ఇన్ స్టాలో ఈ మేరకు సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు యాక్టర్స్ ఈమెకు సానుభూతి తెలియజేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)
'మన దగ్గర వాళ్లని కోల్పోవడం అంత ఈజీ ఏమీ కాదు. నాతో కలిసి పెరిగిన వాళ్లలో ఒకరిని దూరం చేసుకోవడం ఇదే మొదటిసారి. నన్ను మొదటిసారి అక్క అని పిలిచింది శాంతినే. నాకు తెలిసినంత వరకు చాలా దయ కలిగిన వ్యక్తి, ఎలాంటి కల్మషం లేని ఆమె నవ్వు ఆమెకు అత్యంత బలమైన విషయం అని నమ్ముతాను. అదే బలంతో అదే చిరునవ్వుతో ఓ పెద్ద యుద్ధంలో ఆమె పాల్గొంది. గత నాలుగు నెలల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతోంది. ఈ రోజు ఆమె టైమ్ వచ్చేసింది. ఆమె ఓ ఉత్తమ కుమార్తె, సోదరి, వైఫ్, తల్లి, బెస్ట్ ఫ్రెండ్. నా డార్లింగ్ చెల్లెలా, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. మరోవైపు మనం కలుసుకునే వరకు' అని నందిని రెడ్డి భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
అయితే డైరెక్టర్ నందిని రెడ్డి చెబుతున్న దాని ప్రకారం.. ఈమె చెల్లి శాంతి గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఉందని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది నందిని రెడ్డి క్లారిటీ ఇస్తే తప్పితే తెలియదు.
(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు)
Comments
Please login to add a commentAdd a comment