నందినీరెడ్డి దర్శకత్వంలో నితిన్
‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్నారు నితిన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న ‘హార్ట్ ఎటాక్’ ఈ నెలాఖరున విడుదల కానుంది. ‘కొరియర్ బాయ్ కల్యాణ్’ కూడా మరో పక్క సిద్ధమవుతోంది. ‘అలా మొదలైంది’ ఫేమ్ నిందినీ రెడ్డి దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా కమిట్ అయినట్టుగా సమాచారం. ‘అలా మొదలైంది’ తీసిన దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారట. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.