నేనిప్పుడు నితిన్‌తో లవ్‌లో ఉన్నాను!
నేనిప్పుడు నితిన్‌తో లవ్‌లో ఉన్నాను!
Published Fri, Jan 10 2014 1:00 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM
‘‘నేనిప్పుడు నితిన్‌తో లవ్‌లో ఉన్నాను. అంత బాగా నటించాడు. అనూప్‌తో ‘ఇడియట్’ సమయంలోనే సినిమా చేయాల్సింది. అప్పుడు అడిగితే -తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. ఇప్పుడీ సినిమాకు చాలా మంచి సంగీతాన్నిచ్చాడు’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. నితిన్, ఆదాశర్మ జంటగా పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘హార్ట్ ఎటాక్’ పాటల్ని ఇటీవల బ్యాంకాక్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నితిన్ మాట్లాడుతూ -‘‘పూరి జగన్నాథ్ టచ్ ఉన్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇది.
ఇందులో ప్రతి పాటా గొప్పగా ఉంటుంది. భాస్కరభట్ల మంచి లిరిక్స్ ఇచ్చారు. ‘జయం’ తర్వాత నేను, పూరి జగన్నాథ్ కలిసి పనిచేయాలి. కుదర్లేదు. ఇన్నేళ్లకు కుదిరింది’’ అన్నారు. నిజాయితీ ఉన్న ప్రేమకథ ఇదని భాస్కరభట్ల చెప్పారు. అనూప్ మాట్లాడుతూ -‘‘పూరి దర్శకత్వంలో వచ్చిన బుడ్డా హోగా తేరా బాప్, నేను నా రాక్షసి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించాను. ఇన్నాళ్లకు ఆయనతో పూర్తిస్థాయిలో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. ఈ ఏడాది టాప్ హిట్స్‌లో ఈ సినిమా ఉంటుందని మల్టీ డెమైన్షన్ వాసు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య.
Advertisement