యంగ్ హీరో నితిన్ జోరుమీదున్నాడు. ఈ ఏడాది 'చెక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ 'మ్యాస్ట్రో' సినిమా చేస్తున్నాడు. ఇందులో అతడు అంధుడిగా కనిపించనున్నాడు. దీని తర్వాత నితిన్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫిదా భామ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో ఉందట చిత్రబృందం.
ఇదిలా వుంటే నితిన్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'హార్ట్ ఎటాక్' పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుండటం ఫిల్మీదునియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో 'ఉప్పెన' బ్యూటీ కృతీశెట్టిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక నితిన్ సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉంది.
చదవండి: నితిన్‌కు జోడీగా హైబ్రిడ్ పిల్ల... ఈసారైనా ఒప్పుకుంటుందా!
Comments
Please login to add a commentAdd a comment