
‘‘చాలా ఆసక్తికరమైన పాత్ర కోసం సిద్ధమవుతున్నాను. ఈ పాత్రలో నటించడానికి చాలా భయపడుతున్నానని నా మనసుకి అర్థమవుతోంది. చాలా చాలా నెర్వస్‌గా కూడా అనిపిస్తోంది. కానీ ఇప్పటివరకు ఏ సవాల్‌నూ నేను స్వీకరించకుండా ఉండలేదు. చాలాసార్లు మీ గురించి మీరు ఆలోచించినదాని కంటే మీరు బలవంతులు.
కొత్త ప్రయాణం మొదలైంది’’ అని తానెంత స్ట్రాంగ్ హింట్ ఇస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు సమంత. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె కథానాయికగా రూపొందనున్న ఓ లేడీ ఒరియేంటెడ్ సినిమా కోసమే పై మాటలను సమంత చెప్పారని తెలుస్తోంది. ఇది కొరియన్ మూవీ మిస్.గ్రానీకి రీమేక్. ఈ చిత్రం కోసం సమంత కరాటే నేర్చుకుంటున్నారట. ఇంతకుముందు తమిళ చిత్రం ‘సీమరాజా’ కోసం ఆమె కర్ర సాము నేర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment