
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవల లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో ఏడాది గ్యాప్‌లోనే రెండు హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య నటించిన 'థాంక్యూ', బాలీవుడ్ ఫస్ట్ మూవీ 'లాల్ సింగ్ చద్దా' విడుదలకు సిద్ధమవుతున్నాయి. తాజాగా నాగ చైతన్యకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చై తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సమంత బెస్ట్‌ఫ్రెండ్, డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నారట. వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నిజానికి ఈ సినిమాను నాగ చైతన్య, సమంతలతో తీయాలని గతంలో నందినీ రెడ్డి ప్లాన్ చేశారట. కానీ వీరి విడాకుల వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌కి కాస్త బ్రేకులు పడ్డాయి.
తాజాగా నాగ చైతన్య నందినీ రెడ్డి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తున్నాయి. వెంకట్ ప్రభు సినిమా పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. మరి ఇదే నిజమైతే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment