Samantha Emotional Birthday Wishes To Nandini Reddy - Sakshi
Sakshi News home page

Samantha: నీలాంటి వాళ్లు లైఫ్‌లో ఉండాల్సిందే, నువ్వు లేకుండా నేనేం చేయగలను?

Mar 4 2023 8:23 PM | Updated on Mar 4 2023 8:38 PM

Samantha Emotional Birthday Wishes to Nandini Reddy - Sakshi

నీలాంటి ఫ్రెండ్‌ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావు. నువ్వు లేకుండా నేనేం చేయగలను? లవ్‌ యూ.. హ్యాపీ బర్త్‌డే అంటూ నం

ప్రముఖ మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి బర్త్‌డే నేడు (మార్చి 4). ఈ సందర్భంగా హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఎంత బాధ ఉన్నా సరే దాన్ని దరిదాపుల్లోకి కూడా రానీయని నీలాంటి ఫ్రెండ్‌ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. బాధగా ఉండాల్సిన సందర్భంలోనూ నవ్విస్తావు. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావు. నువ్వు లేకుండా నేనేం చేయగలను? లవ్‌ యూ.. హ్యాపీ బర్త్‌డే అంటూ నందినీతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసింది. దీనికి నందిని బిగ్‌ హగ్స్‌.. లవ్‌ యూ సామ్‌ అంటూ రిప్లై ఇచ్చింది.

కాగా సమంత, నందినీ రెడ్డి.. జబర్దస్త్‌, ఓ బేబీ చిత్రాలకు కలిసి పని చేశారు. సమంత కష్టాలతో సావాసం చేస్తున్న సమయంలో నందిని ఆమెకు అండగా నిలబడిందట! తను ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ మహిళా డైరెక్టర్‌ సాయం చేసిందని అంటుంటారు. ఇదిలా ఉంటే సామ్‌ ప్రస్తుతం సిటాడెట్‌, ఖుషి సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement