ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి | Naga Shourya's Kalyana Vaibhogame Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి

Published Sun, Jan 3 2016 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి

ఆ పాటను భయపడుతూ చిత్రీకరించా : నందినీ రెడ్డి

 ‘‘దామోదర్‌రెడ్డిగారు మంచి అభిరుచి గల నిర్మాత. స్క్రిప్ట్‌ను నమ్మి సినిమా తీసే నిర్మాతల్లో ఆయనొకరు. ‘అలా మొదలైంది’  హిట్ మళ్లీ ఈ సినిమాతో రిపీట్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో కేఎల్ రామోదర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. కల్యాణి కోడూరి స్వరాలందించిన  ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని హీరో రామ్ ఆవిష్కరించారు.

నాగశౌర్య మాట్లాడుతూ- ‘‘దామోదర్‌రెడ్డిగారు కథను నమ్ముకుని ధైర్యంగా సినిమా తీసే నిర్మాత. నా నెక్ట్స్ సినిమా కూడా నందినీ రెడ్డిగారితోనే చేస్తాను. కల్యాణి కోడూరిగారితో నాకిది రెండో సినిమా. మంచి పాటలిచ్చారు’’ అని చెప్పారు. ‘‘కల్యాణి ఈ సినిమాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా ‘కల్యాణం...’ సాంగ్ అయితే అద్భుతం. దానికి సరిపడే విజువల్ ఇస్తానా? లేదా అనే డౌట్ వచ్చింది. ఆ పాట మాత్రం భయపడుతూ చేశాను.

 నాగశౌర్య, మాళవిక వయసులో చిన్నవాళ్లయినా యాక్టింగ్‌లోనూ, బిహేవియర్‌లోనూ చాలా మెచ్యూరిటీ, డెడికేషన్ చూపించారు. అందరం ప్రేమించి చేసిన సినిమా ఇది’’ అని నందినీ రెడ్డి తెలిపారు. కేఎల్ దామోదర్‌ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి పనిచేశాం. ఈ చిత్రం ద్వారా రాజు అనే సినిమాటోగ్రఫర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నాగశౌర్య, మాళవిక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అని  చెప్పారు. ఈ వేడుకలో హీరోలు రాజ్‌తరుణ్, సుమంత్ అశ్విన్, సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి, రచయిత లక్ష్మీ భూపాల్, దర్శకులు దశరథ్,  ఇంద్రగంటి మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement