భామనే.. బామ్మనే! | Samantha Remakes korean movie Miss Granny | Sakshi
Sakshi News home page

భామనే.. బామ్మనే!

Published Fri, Oct 26 2018 12:44 AM | Last Updated on Fri, Oct 26 2018 12:44 AM

Samantha Remakes korean movie Miss Granny - Sakshi

సమంత

సమంత.. అందాల భామ. స్క్రీన్‌ మీద కనిపిస్తే చాలు ఫ్యాన్స్‌ ఖుషీ ఖుషీ అయిపోతారు. ‘ఎంత సక్కగున్నవే..’ అంటూ పాట పాడేసుకుంటారు. ఇప్పుడు ఈ అందాల భామ.. బామ్మగా మారబోతున్నారట. నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ముఖ్య పాత్రలో కొరియన్‌ మూవీ ‘మిస్‌ గ్య్రానీ’ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అనూహ్య సంఘటనలతో 70 ఏళ్ల బామ్మ 20 ఏళ్ల అమ్మాయిగా ఎలా మారింది? ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న సంఘటనలు, భామగా ఆ బామ్మ పడ్డ కష్టాలు ఏంటి? అన్న కథాంశమే ఈ చిత్రకథ. ఈ సినిమాలో సమంత 70 ఏళ్ల బామ్మగా కనిపించే సాహసం చేయడానికి రెడీ అయ్యారు. డిసెంబర్‌లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుందని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement