
ఛలో సినిమాతో ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపించిన యంగ్ హీరో నాగశౌర్య తరువాత మరోసారి తడబడ్డాడు. వరుసగా అమ్మగారిళ్లు, కణం, నర్తనశాల సినిమాలతో నిరాశపరిచాడు. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో మరో సినిమా చేస్తున్న ఈ యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్టుగా తెలుస్తోంది.
సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నాగశౌర్య కీలక పాత్రలో నటించనున్నాడట. నందినీ రెడ్డి చివరి సినిమా కళ్యాణ వైభోగమేలోనూ నాగశౌర్యే హీరోగా నటించాడు. లాంగ్ గ్యాప్ తరువాత నందిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రీమేక్ అన్న ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment