Abhishek Nama Gives Clarity On Dating Rumours With Heroine - Sakshi
Sakshi News home page

Abhishek Nama: హీరోయిన్‌తో షికార్లు, డేటింగ్‌? క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Apr 5 2023 4:59 PM | Updated on Apr 5 2023 5:15 PM

Abhishek Nama Gives Clarity On Dating Rumours with Heroine - Sakshi

అభిషేక్‌ నామా, ఓ పాపులర్‌ హీరోయిన్‌ ప్రేమలో పడ్డాడంటూ ఫిల్మీదునియాలో పుకార్లు షికార్లు చేశాయి.

సినీఇండస్ట్రీలో లవ్‌ రూమర్స్‌ కొత్తేం కాదు, ఏ ఇద్దరు కలిసి కనిపించినా వారు ప్రేమలో ఉన్నారంటూ ముడిపెట్టేస్తుంటారు. అయితే హీరోహీరోయిన్లు, దర్శకుడు హీరోయిన్‌ లవ్‌లో ఉన్నారంటూ తరచూ ఏదో ఒక గాసిప్‌ వినిపిస్తూనే ఉంటుంది. కానీ నిర్మాత, హీరోయిన్‌ ప్రేమలో పడ్డారని రూమర్స్‌ రావడం చాలా అరుదు. అయితే కొంతకాలం క్రితం అభిషేక్‌ నామా, ఓ పాపులర్‌ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడంటూ ఫిల్మీదునియాలో పుకార్లు షికార్లు చేశాయి.

తాజాగా ఈ రూమర్లపై అభిషేక్‌ నామా స్పందించాడు. 'హీరోయిన్‌తో డేటింగ్‌ అనేది వుట్టి మాటే! హీరోయిన్లతో కనీసం స్నేహం కూడా లేదు. వారితో లంచ్‌కు కూడా వెళ్లలేదు. నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్‌లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా అభిషేక్‌ నామా, రవితేజతో కలిసి నిర్మించిన రావణాసుర ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. మరోవైపు నందమూరి కళ్యాణ్‌రామ్‌తో డెవిల్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. డెవిల్‌ చిత్రానికి సీక్వెల్‌ కూడా తీస్తానని ప్రకటించాడు అభిషేక్‌ నామా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement