ఏజెంట్‌ వినోద్‌ | Agent Vinod Pre Look Release | Sakshi
Sakshi News home page

ఏజెంట్‌ వినోద్‌

Published Fri, Aug 7 2020 6:05 AM | Last Updated on Fri, Aug 7 2020 6:05 AM

Agent Vinod Pre Look Release - Sakshi

అభిషేక్‌ నామా

టాలీవుడ్‌లో పేరు పొందిన డిస్ట్రిబ్యూషన్‌ , ప్రొడక్షన్‌ హౌస్‌లలో ఒకటైన అభిషేక్‌ పిక్చర్స్‌ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘ఏజెంట్‌ వినోద్‌’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘హారీపోటర్, పైరేట్స్‌ ఆఫ్‌ ద కరీబియన్‌ , ప్రి¯Œ ్స ఆఫ్‌ పర్షియా, 2012, బ్యాట్‌మ్యాన్‌: ద డార్క్‌ నైట్‌’ వంటి దాదాపు 40 హాలీవుడ్‌ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్‌ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

దేవా¯Œ ‡్ష నామా, రవి పుట్టా సమర్పణలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ లుక్‌లో పుస్తకాలు, తాళాలు, లాంతరు, టైపింగ్‌ మెషీన్‌ , పెన్ను, కెమెరా, గడియారం, ప్రపంచపటం.. వంటి పాత కాలం నాటి వస్తువులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు గన్‌ , రక్తపు మరకలు, ఒక వ్యక్తి నీడ కనిపిస్తుండటంతో ఇది ఉత్కంఠభరితమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ అని తెలుస్తోంది. ‘‘ఒక యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో టైటిల్‌ రోల్‌ చేయబోతున్నారు’’ అని అభిషేక్‌ నామా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్, కెమెరా: జగదీష్‌ చీకటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement