Abhishek Pictures
-
నా కొడుకును బ్లాక్మెయిల్ చేస్తున్నాడు: విజయ్ దేవరకొండ తండ్రి
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు గడ్డుకాలం నడుస్తోంది. గతకొంతకాలంగా సరైన హిట్ లేక నీరుగారిపోయిన అతడికి ఖుషి సినిమా సక్సెస్‌ను తెచ్చిపెట్టింది, కానీ దాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. కారణం.. ఖుషి హిట్ కొట్టిన ఆనందంలో తన అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు విజయ్. వంద కుటుంబాలకు కలిపి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. ఇంకేముంది, విజయ్ ప్రకటన చూసిందే ఆలస్యం ఓ నిర్మాణ సంస్థ కౌంటర్‌కు దిగింది. పబ్లిక్‌గా టార్గెట్ 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం, దీనిపై ఎవరూ స్పందించట్లేదు. ఎలాగో మీరు వంద కుటుంబాలకు కోటి ఇస్తామంటున్నారు. అలాగే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా ఆదుకుంటారని ఆశిస్తున్నాం' అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. దీంతో విజయ్‌కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. నిజానికి సినిమా లాభనష్టాలనేది నిర్మాత- డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వ్యవహారం. కానీ ఇలా పబ్లిక్‌గా డబ్బులివ్వమని హీరో విజయ్ను టార్గెట్ చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్యునరేషన్ సగం వెనక్కు తాజాగా ఈ వ్యవహారంపై విజయ్ తండ్రి గోవర్దన్ రావు స్పందించాడు. 'వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఆడనప్పుడు విజయ్ తన రెమ్యునరేషన్లో సగం వెనక్కు ఇచ్చేశాడు. తనకు ఇస్తానన్న ఫ్లాట్ కూడా వద్దన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయగలడు. అయినా డిస్ట్రిబ్యూటర్‌కు నష్టాలు వస్తే విజయ్ ఏం చేస్తాడు? అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్ చాలాకాలంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. మేము అతడితో మాట్లాడుతున్న విషయం కూడా విజయ్‌కు తెలియదు. అలాంటిది ఇప్పుడేకంగా సోషల్ మీడియాలో నా కొడుకు పేరు ప్రస్తావించడం బాధాకరం. నిజంగా మేము అతడికి ఏమైనా డబ్బులిచ్చేది ఉంటే కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సింది. విజయ్ అతడితో సినిమాలు చేయడు అభిషేక్ నా కొడుకును బ్లాక్మెయిల్ చేయాలని చేస్తున్నాడు. కానీ అతడి పప్పులేమీ ఉడకవు. ఓసారేమో విజయ్ మార్కెట్ పడిపోయిందంటాడు. మరోసారి విజయ్‌తో సినిమా నిర్మించేందుకు అతడి డేట్స్ కావాలంటాడు. అతడు మాట్లాడే మాటలకు పొంతన కుదరడం లేదు. అయినా ఇప్పటికే విజయ్.. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లలో సినిమాలు చేసేందుకు సంతకం చేశాడు. కాబట్టి అతడి డేట్స్ ఖాళీగా లేవు. అభిషేక్ నామాతో విజయ్ సినిమాలు చేయడు' అని చెప్పుకొచ్చాడు. Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 చదవండి: రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ.. -
'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు
హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ ఒక్కటి లేదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యేసరికి తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించాడు. ఇప్పుడు దీని వల్ల విజయ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి. 'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటి పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా చాలా సినిమాల రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పరుచుకున్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఢమాల్ అన్నాయి. తాజాగా విజయ్ రూ.కోటి ఇస్తానని ప్రకటన చేయడంపై ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది. (ఇదీ చదవండి: నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర) 'డియర్ విజయ్ దేవరకొండ. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. మీరు ఇప్పుడు.. 100 కుటుంబాలకు ఎంతో పెద్ద మనసుతో రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. అలా ఎగ్జిబిటర్ల్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీని ఆదుకుంటారని కోరుతున్నాం' అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త ఇండస్ట్రీలో పాత సమస్యల్ని బయటకు తీసుకురావడమే కాదు, విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా విషయంలో లాభం, నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం. మరి ఇలా పబ్లిక్ గా విజయ్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఏంటా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) Dear @TheDeverakonda , We lost 8 crs in the distribution of #WorldFamousLover, but no one responded over it!! Now as you are donating 1CR to the families with your big heart, Kindly requesting & Hoping for you to save us and our Exhibitors & Distributors families also 🤗❤️… pic.twitter.com/dwFHytv1QJ — ABHISHEK PICTURES (@AbhishekPicture) September 5, 2023 -
ఏజెంట్ వినోద్
టాలీవుడ్లో పేరు పొందిన డిస్ట్రిబ్యూషన్ , ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన అభిషేక్ పిక్చర్స్ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ‘హారీపోటర్, పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ , ప్రి¯Œ ్స ఆఫ్ పర్షియా, 2012, బ్యాట్‌మ్యాన్: ద డార్క్ నైట్’ వంటి దాదాపు 40 హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా చేసిన నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవా¯Œ ‡్ష నామా, రవి పుట్టా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ లుక్‌లో పుస్తకాలు, తాళాలు, లాంతరు, టైపింగ్ మెషీన్ , పెన్ను, కెమెరా, గడియారం, ప్రపంచపటం.. వంటి పాత కాలం నాటి వస్తువులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు గన్ , రక్తపు మరకలు, ఒక వ్యక్తి నీడ కనిపిస్తుండటంతో ఇది ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ‘‘ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టైటిల్ రోల్ చేయబోతున్నారు’’ అని అభిషేక్ నామా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, కెమెరా: జగదీష్ చీకటి. -
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ‘సెవెన్’ రిలీజ్
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సెవెన్. కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్లో రమేష్ వర్మ నిర్మాణంలో డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. రెహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. రమేష్ వర్మ కథ అందించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పటికే శుభం విశ్వనాధ్ సాహిత్యం అందించిన ‘సంపోద్దోయ్ నన్నే’, పులగం చిన్నారాయణ సాహిత్యం అందించిన ‘ఇదివరకెపుడు తెలియదు’ పాటలు విడుదలయ్యాయి. ఇటీవల సినిమా ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ కాపీ చూసిన అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా క్రేజీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ ‘ఇటీవల సెవెన్ ఫస్ట్ కాపీ చూశాను. మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. థ్రిల్లర్ ఫిల్మ్స్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందీ సినిమా. ఒక ట్విస్ట్ వెనుక మరొక ట్విస్ట్ ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి. రమేష్ వర్మగారు ఫెంటాస్టిక్ స్టోరీ, స్క్రీన్ ప్లే రాశారు. నిర్మాణంలోనూ రాజీ పడలేదు. రిచ్‌గా సినిమా తీశారు. ఆయన కథ సినిమాకు ఒక హైలైట్ అయితే... హవీష్ యాక్టింగ్ మరో హైలైట్. నటుడిగా కొత్త హవీష్ ను ప్రేక్షకులు ఈ సినిమాలో చూస్తారు. మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రమేష్ వర్మ కథకు నిజార్ షఫీ న్యాయం చేశారు. ఆయన సినిమాటోగ్రఫీ సూపర్. ఆరుగురు హీరోయిన్ల పాత్రలు కథలో భాగంగా సాగుతాయి. ప్రేక్షకులకు ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ఫస్ట్ కాపీ చూశాక... విపరీతంగా నచ్చడంతో సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నాను. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా మా సంస్థ ద్వారా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. -
ఫస్ట్ లుక్.. పర్ఫెక్ట్ గూఢచారి
క్షణం, అమీ తుమీ హిట్లతో జోరు మీదున్న యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు ‘గూఢచారి’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. స్టైలిష్ గా ఉన్న శేష్ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో కస్టమ్ అధికారి రవి పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శశికిరణ్ టీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 2013లో మిస్ ఇండియా ఎర్త్ శోభితా దూళిపాళ్ల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర ద్వారా అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ(అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్ర హీరోయిన్) రీఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సమ్మర్లో గూఢచారి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
సరికొత్తగా...
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఓ వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇందులో శ్రీనివాస్‌ను సరికొత్తగా చూపించనున్నా. బాలీవుడ్ హీరోయిన్ను శ్రీనివాస్ సరసన సెలక్ట్ చేస్తాం. ఒక మేజర్ షెడ్యూల్‌ను ఫారిన్లో ప్లాన్ చేస్తున్నాం. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత పీటర్ హెయిన్స్ ఫైట్స్ సమకూర్చుతున్నారు’’ అన్నారు. ‘‘శ్రీవాస్ కథ బాగా నచ్చింది. శ్రీనివాస్ హీరోగా ఒక సినిమా నిర్మించాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పుడు మా కాంబినేషన్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం సంతోషంగా ఉంది. శ్రీనివాస్, శ్రీవాస్ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది’’ అన్నారు నిర్మాత. జగపతిబాబు, రవికిషన్, మధు గురుస్వామి (కన్నడ నటుడు) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
బాబు మాటల గారడీ!
బాబు చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తాడు. అతను మాత్రం ఇన్నోసెంట్ కాదు. ఇప్పటివరకూ వంద మంది అమ్మాయిలను మాటల గారడీతో మాయలో పడేశాడు. అతని కథేంటనేది వచ్చే నెల 13న చూడమంటున్నారు దర్శకుడు నవీన్ మేడారం. అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ పతాకాలపై అభిషేక్ నామా నిర్మించిన సినిమా ‘బాబు బాగా బిజి’. మిస్తీ చక్రవర్తి, తేజస్వి, శ్రీముఖి, సుప్రియ హీరోయిన్లు. హిందీ హిట్ ‘హంటర్’కు తెలుగు రీమేక్ ఇది. ఏప్రిల్ 13న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘ఇది రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో ఏ సినిమా రాలేదు. అవసరాల చక్కగా నటించారు. టీజర్‌కు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్’’ అన్నారు నిర్మాత. -
బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..?
-
బోయపాటి సినిమాకు నిర్మాత మారాడా..?
మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన బోయపాటి, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆసక్తి కరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే తాజాగా ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ పిక్చర్స్ తప్పుకుందన్న వార్త టాలీవుడ్ లో మాట్ టాపిక్ గా మారింది. దర్శకుడి రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన వివాదమే ఇందుకు కారణం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అంతేకాక ఒకే సారి నాలుగైదు సినిమాలను నిర్మిస్తున్న అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేదన్న ఉద్దేశంతో బెల్లంకొండ శ్రీనివాస్ కావాలనే నిర్మాణ బాధ్యతలు వేరే వారికి అప్పగించారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇకపై కోన వెంకట్ తో కలిసి ఎల్ రవీంద్రారెడ్డి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నారు. -
వినోదం... సందేశం... మన ఊరి రామాయణం
‘‘ఈ సినిమా చూస్తుంటే.. ప్రతి రోజూ సమాజంలో మనకు తారసపడుతున్న సంఘటనలను తెరపై చూస్తున్న భావన కలగడం ఖాయం. ‘మన ఊరి రామాయణం’ సినిమా కాదు. మనందరం నివసిస్తున్న సమాజం. మనం ప్రతిరోజూ చూస్తున్న కథలకు దృశ్యరూపం. ఇందులో వినోదమూ ఉంది. పంచదార పూతపూసిన మందు గుళికలా.. ఆ వినోదం మాటున మంచి సందేశమూ ఉంది’’ అని అభిషేక్ నామా అన్నారు. ప్రకాశ్ రాజ్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మన ఊరి రామాయణం’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ప్రియమణి, పృథ్వీ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అభిషేక్ నామా తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన పట్ల అభిషేక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు... నాకు ప్రకాశ్‌రాజ్ ఓ రోజు ఫోన్ చేశారు. ‘నేనో సినిమా తీశా. మీరోసారి చూడండి. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారాయన. సినిమా పేరు, ఇతర వివరాలు ఏం చెప్పలేదు. అవన్నీ అప్రస్తుతం అన్నారు. అప్పటికి ఫైనల్ వెర్షన్ రెడీ కాలేదు. నాకు ప్రత్యేకంగా షో వేశారు. నటుడిగా, దర్శకుడిగా ప్రకాశ్‌రాజ్ ప్రతి సన్నివేశంలోనూ ప్రకాశించారు. ప్రియమణి పాత్రను తీర్చిన విధానం, అందులో ఆమె నటన అద్భుతం. ‘నేను బంగారాన్నే కదా’, ‘ఏంటి.. ఆకలితో చంపేద్దాం అనుకుంటున్నావా’ డైలాగులు చెప్పినప్పుడు ప్రియమణి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూడగానే.. మనసులో ఏదో మంచి ఫీలింగ్. ఈ మధ్య కాలంలో వినోదంతో కూడిన ఇంత మంచి కాన్సెప్ట్ మూవీ నేను చూడలేదు. బాగా నచ్చేసింది. ఇటువంటి మంచి సినిమాను కచ్చితంగా ప్రేక్షకులకు చూపించాలనుకున్నా. అందరి కంటే ముందుగా సినిమాను నాకు చూపించినందుకు ప్రకాశ్‌రాజ్‌కి అభినందనలు తెలియజేశా. ఇది భారీ బడ్జెట్ సినిమా కాదు. ప్రేక్షకుల దగ్గరికి సినిమాను ఎలా తీసుకువెళ్లాలి? ప్రమోషన్ ఎలా చేయాలి? ఎన్ని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుంది? అనే అంశాలపై అందరం కూర్చుని ఓ వారం రోజులు కసరత్తులు చేశాం. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాం. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ శాతం విడుదల చేశాం. మా అంచనా ప్రకారం నూటికి నూరు శాతం ప్రేక్షకులకు చేరువైందీ సినిమా. ఏ నోట విన్నా ‘మన ఊరి రామాయణం’ బాగుంది అనే మాట వినబడుతోంది. మంచి రివ్యూలు వచ్చాయి. ప్రేక్షకులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటుంటే.. నా జడ్జ్మెంట్ కరెక్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. -
ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్లతో మాట్లాడతా
- సుకుమార్ ‘‘ప్రస్తుతం చాలామంది సృజనాత్మకంగా ఆలోచించి అర్థవంతమైన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలని ఈ పోటీ నిర్వహిస్తున్నాం’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నిర్వహిస్తున్న ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’కి సలహాదారుగా వ్యవహరించడానికి ఆయన అంగీకరించారు. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ- ‘‘కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే కొత్త రకం సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచిస్తున్నామా? అనే సందేహం వచ్చిన ప్రతిసారీ నేను షార్ట్ ఫిల్మ్ డెరైక్టర్స్‌తో మాట్లాడుతుంటాను’’ అన్నారు. అభిషేక్ నామా మాట్లాడుతూ- ‘‘ఆర్నెల్ల క్రితం ఈ షార్ట్ ఫిల్మ్స్ ఐడియా వచ్చింది. ఈ నెల 20నుంచి సెప్టెంబర్ 15 వరకు షార్ట్ ఫిల్మ్స్‌ని పంపించాలి. వాటిలో బాగున్న మూడు చిత్రాలను ఎంపిక చేసి, ఆ దర్శకులకు మా సంస్థలో అవకాశం కల్పిస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు నందనీరెడ్డి, తరుణ్ భాస్కర్, రవికాంత్ పేరెపు, సుధీర్ వర్మ, నటుడు అడివి శేష్. గాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి... ఒకటికి... అయిదు!
‘శ్రీమంతుడు’, ‘రుద్రమదేవి’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సుప్రీమ్’, ‘కబాలి’ సినిమాలతో పాటు పలు సినిమాలను పంపిణీ చేసిన అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేశారీ సంస్థ అధినేత అభిషేక్. ఇప్పటికే ఫాంటమ్-రిలయన్స్ సంస్థలతో కలిసి అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న హిందీ ‘హంటర్’ తెలుగు రీమేక్ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నామని అభిషేక్ తెలిపారు. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. దేవిశ్రీప్రసాద్ పాటలు స్వరపరుస్తారు. రిషీ పంజాబీ కెమేరామ్యాన్‌గా వ్యవహరించనున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ఆరంభం కానుంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందించనున్న చిత్రం షూటింగ్‌ని కూడా ఇదే నెలలోనే ప్రారంభిస్తామని అభిషేక్ చెప్పారు. అడివి శేష్, అదా శర్మ జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో నిర్మించబోతున్న ‘గూఢచారి’ చిత్రాన్ని ఆగస్టులో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుధీర్‌బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందించనున్న చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు. -
బిజీ అవుతోన్న యంగ్ హీరో
కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అడవి శేష్, ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాత హీరో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ తీసుకున్న ఈ యువ నటుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా కూడా అనుభవం ఉన్న ఈ ఎన్నారై కుర్రాడు తాజా విజయంతో హీరోగా బిజీ అవుతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత అడవి శేష్, తానే కథ అందించి హీరోగా నటించిన సినిమా క్షణం. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు వరుస అవకాశాలలతో బిజీ అవుతున్నాడు. డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఇటీవలే నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ పిక్చర్స్, అడవి శేష్ హీరోగా రెండు సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు శేష్.