ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్లతో మాట్లాడతా | Sukumar & Abhishek Pictures Telugu Short Film Festival Announced | Sakshi
Sakshi News home page

ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్లతో మాట్లాడతా

Published Thu, Aug 18 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్లతో మాట్లాడతా

ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా వాళ్లతో మాట్లాడతా

 - సుకుమార్
 ‘‘ప్రస్తుతం చాలామంది సృజనాత్మకంగా ఆలోచించి అర్థవంతమైన షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. అలాంటివారిని ప్రోత్సహించాలని ఈ పోటీ నిర్వహిస్తున్నాం’’ అని దర్శకుడు సుకుమార్  అన్నారు. అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నిర్వహిస్తున్న ‘షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్’కి సలహాదారుగా వ్యవహరించడానికి ఆయన అంగీకరించారు. గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ- ‘‘కొత్తవారిని ఎంకరేజ్ చేస్తే కొత్త రకం సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలోచిస్తున్నామా? అనే సందేహం వచ్చిన ప్రతిసారీ నేను షార్ట్ ఫిల్మ్ డెరైక్టర్స్‌తో మాట్లాడుతుంటాను’’ అన్నారు. అభిషేక్ నామా మాట్లాడుతూ- ‘‘ఆర్నెల్ల క్రితం ఈ షార్ట్ ఫిల్మ్‌స్ ఐడియా వచ్చింది.
 
 ఈ నెల 20నుంచి సెప్టెంబర్ 15 వరకు
 షార్ట్ ఫిల్మ్స్‌ని పంపించాలి. వాటిలో బాగున్న మూడు చిత్రాలను ఎంపిక చేసి,
 ఆ దర్శకులకు మా సంస్థలో అవకాశం కల్పిస్తాం’’ అని చెప్పారు.
 ఈ కార్యక్రమంలో దర్శకులు నందనీరెడ్డి, తరుణ్ భాస్కర్, రవికాంత్ పేరెపు, సుధీర్ వర్మ, నటుడు అడివి శేష్. గాయకుడు మణిశంకర్ అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement