ఐ యామ్ దట్ ఛేంజ్! | short film making is not an easy, says allu arjun | Sakshi
Sakshi News home page

ఐ యామ్ దట్ ఛేంజ్!

Published Fri, Aug 15 2014 11:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఐ యామ్ దట్ ఛేంజ్!

ఐ యామ్ దట్ ఛేంజ్!

"చేతిలో ఓ కెమెరా, మెదడులో చిన్న ఆలోచన, సినిమా తీయాలన్న తపన.. ఇవి చాలు వారికి సినిమా తీయడానికి! కానీ నిజానికి లఘుచిత్రం తీయడం అంత చిన్న విషయమేమీ కాదు. ఆర్థికంగా ఇంత బలంగా, ఇంత సపోర్ట్ ఉన్న నేనే ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇంత కష్టపడాల్సి వచ్చింది. మరి.. ఏ అండా లేకుండా, ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నా కూడా సినిమాపై ఉన్న ప్రేమతో వారంతా (షార్ట్ ఫిల్మ్‌మేకర్స్‌ను ఉద్దేశించి..) ఎలా సినిమాల్ని తీయగలుగుతున్నారో అర్థమవ్వదు. నిజంగా వారందరికీ నా అభినందనలు." ఇంత లోతైనా మాటలను మాట్లాడిన ఆ హీరో ఎవరో కాదు.. తన సినిమాలతో లక్షలాది అభిమానుల్ని సంపాదించి పెట్టుకున్న మన అల్లు అర్జున్.

అల్లు అర్జున్ నటిస్తూ, నిర్మిస్తున్న లఘుచిత్రం.. 'ఐ యామ్ దట్ చేంజ్'. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక సామాజిక కథాంశం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా విడుదల చేస్తున్నారు. "ఎప్పట్నుంచో ఓ మంచి కథాంశాన్ని ఎంచుకొని సమాజానికి ఉపయోగపడే ఓ షార్ట్‌ఫిల్మ్ తీయాలని అనుకుంటుండేవాణ్ణి. ఇదిగో ఇన్నాళ్లకిలా సుకుమార్ గారి దర్శకత్వంలో ఆ కల నెరవేరింది." అంటూ ఈ సినిమా తీయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పాడు అల్లు అర్జున్.

ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది. సమాజంలో ప్రతి ఒక్కరూ సొంత బాధ్యత తీసుకుని వ్యవహరించాలని, అప్పుడే సమాజం మొత్తం మారుతుందనే సందేశాన్ని ఇందులో ఇచ్చారు. ఒక స్టార్ హీరో.. ఏ సంకోచం లేకుండా ఒక మంచి కాన్సెప్ట్‌ని ఎక్కువ మందికి చేరువయ్యేలా షార్ట్‌ఫిల్మ్ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement