'రూ.కోటి' ప్రకటనతో రౌడీ హీరోకి కొత్త తలనొప్పులు | Abhishek Pictures Asked 8 Crores Loss Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: అన్ని కోట్లు పోగొట్టుకున్నా.. విజయ్ ఆదుకోవాలి!

Published Tue, Sep 5 2023 9:08 PM | Last Updated on Tue, Sep 5 2023 9:14 PM

Abhishek Pictures Asked 8 Crores Loss Vijay Devarakonda - Sakshi

హీరో విజయ్ దేవరకొండ 'ఖుషి' హిట్ అయ్యేసరికి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా సినిమాలు చేస్తున్నాడు గానీ సరైన సక్సెస్ ఒక్కటి లేదు. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యేసరికి తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. 100 కుటుంబాలకు కలిపి రూ.కోటి ఇస్తానని బంపరాఫర్ ప్రకటించాడు. ఇప్పుడు దీని వల్ల విజయ్ కి కొత్త తలనొప్పులు వస్తున్నాయి.

'పెళ్లిచూపులు', 'అర్జున్ రెడ్డి' సినిమాలతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత సరైన హిట్ ఒక్కటి పడలేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ ఇలా చాలా సినిమాల రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఏర్పరుచుకున్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఢమాల్ అన్నాయి. తాజాగా విజయ్ రూ.కోటి ఇస్తానని ప్రకటన చేయడంపై ప్రముఖ నిర్మాణ సంస్థ కాంట్రవర్సీ ట్వీట్ చేసింది.

(ఇదీ చదవండి: నరేశ్ ముద్దుపేరు ఏంటో చెప్పేసిన పవిత్ర)

'డియర్ విజయ్ దేవరకొండ. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నాం. కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. మీరు ఇప్పుడు.. 100 కుటుంబాలకు ఎంతో పెద్ద మనసుతో రూ.కోటి ఇస్తామని ప్రకటించారు. అలా ఎగ్జిబిటర్ల్, డిస్ట్రిబ్యూటర్స్ ఫ్యామిలీని ఆదుకుంటారని కోరుతున్నాం' అని అభిషేక్ పిక్చర్స్ ట్వీట్ చేసింది.

ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త ఇండస్ట్రీలో పాత సమస్యల‍్ని బయటకు తీసుకురావడమే కాదు, విజయ్ దేవరకొండకు కొత్త తలనొప్పుల్ని తీసుకొచ్చేలా కనిపిస్తుంది. అయితే ఓ సినిమా విషయంలో లాభం, నష్టం అనేది డిస్ట్రిబ్యూటర్స్.. నిర్మాతలతో తేల్చుకోవాల్సిన విషయం. మరి ఇలా పబ్లిక్ గా విజయ్ పేరు ప్రస్తావిస్తూ ట్వీట్ చేయడం ఏంటా అని పలువురు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. 

(ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement