బిజీ అవుతోన్న యంగ్ హీరో | Adivi Sesh signs two-film deal with Abhishek Pictures | Sakshi
Sakshi News home page

బిజీ అవుతోన్న యంగ్ హీరో

Published Sat, Apr 2 2016 5:37 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

బిజీ అవుతోన్న యంగ్ హీరో

బిజీ అవుతోన్న యంగ్ హీరో

కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో అడవి శేష్, ఆ సినిమాతో ఆకట్టుకోలేకపోయాడు. దీంతో తరువాత హీరో అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టర్న్ తీసుకున్న ఈ యువ నటుడు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. నటుడిగానే కాక రచయితగా, దర్శకుడిగా కూడా అనుభవం ఉన్న ఈ ఎన్నారై కుర్రాడు తాజా విజయంతో హీరోగా బిజీ అవుతున్నాడు.

లాంగ్ గ్యాప్ తరువాత అడవి శేష్, తానే కథ అందించి హీరోగా నటించిన సినిమా క్షణం. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతో ఇప్పుడు వరుస అవకాశాలలతో బిజీ అవుతున్నాడు. డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి ఇటీవలే నిర్మాణం రంగంలోకి అడుగుపెట్టిన అభిషేక్ పిక్చర్స్, అడవి శేష్ హీరోగా రెండు సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు శేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement