అమెరికాలో ‘గూఢచారి’ | Adivi Sesh Goodachari USA Schedule Commenced | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 20 2018 4:18 PM | Last Updated on Tue, Feb 20 2018 4:18 PM

Adivi Sesh Gudachari - Sakshi

గూఢచారి సినిమా ఫస్ట్‌ లుక్‌

‘క్షణం’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ తరువాత అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘గూఢచారి’.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా - టిజి విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్  మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో ‘గూఢచారి’ తెరకెక్కుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా ‘గూఢచారి’ సినిమా విడుదల చేయనున్నాం’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement