మధుశాలిని, అడివి శేష్, శోభితా, శశికిరణ్ తిక్క, బాబీ, డి. సురేశ్‌బాబు
‘‘సినిమాలపై ఆసక్తితో అడివి శేష్ అమెరికా నుంచి ఇక్కడకు వచ్చాడు. ‘క్షణం’ తర్వాత చేసిన చిత్రమిది. విజువల్స్ చూస్తేనే సినిమా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 160 రోజుల్లో 168 లొకేషన్స్‌లో ‘గూఢచారి’ చిత్రం షూట్ చేయడం గొప్ప విషయం’’ అని నిర్మాత డి.సురేశ్ బాబు అన్నారు. అడివి శేష్, శోభితా ధూళిపాళ్ల జంటగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూఢచారి’. అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో అడివి శేష్ మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శశితో నేను సింక్ కావడానికి టైమ్ పట్టింది. తనను నేను నమ్మితే... తను నన్ను నమ్మాడు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి హీరో అనొచ్చు. అద్భుతమైన రీ రికార్డింగ్ ఇచ్చాడు. ఈ సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నారు’’ అన్నారు. ‘‘శేష్ విజన్‌ని నేను షేర్ చేసుకోగలనా? అనుకున్నాను. 10 నెలలు నేను, రాహుల్, శేష్ కలిసి స్క్రిప్ట్ రాశాం. మధ్య మధ్యలో అబ్బూరి రవిగారిని కలిసేవాళ్లం.
ఆయన దగ్గర రియల్ ఫిల్మ్ స్కూల్ అంటే ఏంటో నేర్చుకున్నా’’ అన్నారు శశికిరణ్ తిక్క. ‘‘నేను తెలుగమ్మాయినే. తెలుగులో నాకిది ఫస్ట్ మూవీ. మంచి టీమ్‌తో పనిచేశాననే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు శోభితా దూళిపాళ్ల. ‘‘గూఢచారి’ వంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలనుకుంటున్నాం’’ అన్నారు టి.జి. విశ్వప్రసాద్. ‘‘ఈ సినిమా టీజర్ చూసి థ్రిల్ అయ్యాను. అంత తక్కువ బడ్జెట్‌లో ఇంత మంచి సినిమా చేయడం కుదురుతుందా? నేనైతే చేయలేను. 20–30 కోట్ల రూపాయల సినిమాలా అనిపిస్తో్తంది’’ అని ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నిర్మాత అనిల్ సుంకర అన్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్, రచయిత కోన వెంకట్, డైరెక్టర్ బాబీ, నిర్మాత భరత్ చౌదరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment