బ్రెయిన్ డిజప్పాయింటెడ్.. హార్ట్ ఎంజాయింగ్ | Adivi sesh Goodachari Shooting Update | Sakshi
Sakshi News home page

బ్రెయిన్ డిజప్పాయింటెడ్.. హార్ట్ ఎంజాయింగ్

Published Sat, Nov 18 2017 11:02 AM | Last Updated on Sat, Nov 18 2017 11:02 AM

Adivi sesh Goodachari Shooting Update - Sakshi

క్షణం సినిమాతో హీరోగా రచయితగా సక్సెస్ సాధించిన యంగ్ హీరో అడివి శేష్ మరో ఆసక్తిరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గూఢచారి పేరుతో తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. అడివి శేష్ కథ అందిస్తున్న ఈ సినిమాతో శశికిరణ్ తిక్క దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ భయకర టెర్రరిస్ట్ ను పట్టుకునే గుఢచారిగా అడివి శేష్ నటిస్తున్నాడు.

మిస్ ఇండియా అవార్డ్ సాధించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు వర్షం కారణంగా అంతరాయం కలుగుతోంది. ఈ విషయాన్ని తనదైన స్టైల్ లో అభిమానులతో షేర్ చేసుకున్నాడు శేష్. 'వరుణ దేవుడు ఆడుకుంటున్నాడు. షాట్ ఆలస్యమైంది. బ్రెయిన్ డిజప్పాయింటెడ్, మనసు మాత్రం ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది' అంటూ ట్వీట్ చేశాడు. తరువాత 'చివరకు సూర్యుడు వచ్చాడు ఏరియాల్ షాట్ ల చిత్రీకరణ జరగబోతోంది. చాలా ఎక్సైటింగ్ గా ఉంది' అంటూ ట్వీట్ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement