
‘జయ జానకి నాయక’ చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తోన్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాక్ష్యం’. పూజా హెగ్డే కథానాయిక. శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ దుబాయ్‌లో జరుగుతోంది. అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. హైదరాబాద్, పొల్లాచ్చి, వారణాసి, హోస్‌పేట వంటి ప్రాంతాల్లో భారీ క్యాస్టింగ్‌తో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుతున్నాం.
శ్రీనివాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు పీటర్ హెయిన్ నేతృత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నాం. పూజా హెగ్డే, జయప్రకాశ్, పవిత్ర లోకేష్, ‘వెన్నెల’ కిశోర్ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నాం. ఇటీవల విడుదలైన మా సినిమా మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభించింది. వేసవి కానుకగా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్ధర్ ఎ.విల్సన్, సంగీతం: హర్షవర్ధన్.
Comments
Please login to add a commentAdd a comment