‘ధ్రిల్లర్ జోనర్స్ లో షాకింగ్, వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ముందే ఆడియన్స్‌కి తెలిస్తే.. ఆ కిక్కు రాదు. ‘రావణాసుర’ థ్రిల్లర్ మూవీ. అందుకే ఆ సినిమా కథ గురించి బయటకు చెప్పడం లేదు. థియేటర్స్‌లో రవితేజ నటనను చూసి షాకవుతారు’ అని నిర్మాత అభిషేక్ నామా అన్నారు. రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అభిషేక్ నామా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
► ఇంతవరకూ రవితేజ ‘రావణాసుర’లాంటి సినిమా చేయలేదు. ఈ సినిమా చూసిన తర్వాత రవితేజ ఇలా కూడా చేయగలుగుతారా ? అని ప్రేక్షకులు షాక్ అవుతారు. కొత్త కాన్సెప్ట్ . ఇది వర్కౌట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారు.
►రావణాసుర కథ నచ్చి, దానిపై నమ్మకంతోనే డబ్బుపెట్టాం. నమ్మకం ఉన్నపుడు వేరే వాళ్ళకి ఇవ్వడం ఎందుకు ? మేము నమ్మిన సినిమా మేమే విడుదల చేస్తున్నాం.
►అనుకున్న బడ్జెట్ లోనే ఈ సినిమా పూర్తి చేశాం. సుధీర్ వర్మ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్ కి పూర్తి చేశారు.
►ఈ చిత్రంలో రవితేజను చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయి షాక్ లో ఉంటారు. రవితేజ గారిని ఇంత కొత్త కోణంలో చూసే సరికి అదిరిపోయింది కదా అనే ఫ్యాక్టర్ వస్తుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ విడుదలైన తర్వాత ఇదే సబ్జెక్ట్ తో పాన్ ఇండియా ప్లాన్ చేయాలనే ఆలోచన ఉంది.
►సుధీర్ వర్మతో ‘కేశవ’ సినిమా చేశాను. అది కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యింది. అయితే బ్లాక్ బస్టర్ మిస్ అయ్యింది. రావణాసురతో బ్లాక్ బస్టర్ వంద శాతం కొడతాం.
►మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కుటుంబం అంతా సంగీతకారులు. తనకి చాలా ప్రతిభ ఉంది. మొదట ‘సాక్ష్యం’ సినిమా ఇచ్చాను. తర్వాత రవితేజ గారికి చెప్పాను. రావణాసురతో తన ప్రతిభని మరోసారి నిరూపించుకున్నాడు.
►ప్రస్తుతం నేను నిర్మిస్తున్న డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు మూడు నెలల్లో ఏదైనా మంచి డేట్ చూసి విడుదల చేస్తాం. డెవిల్ 2 కూడా ఉంది. 2024లో దాదాపుగా ఏడు సినిమాలు లాంచ్ చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment