
బెల్లకొండ సాయిశ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్‌పై అభిషేక్ నామా ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారణాసిలో 15 రోజుల షెడ్యూల్ పూర్తయింది. అభిషేక్ నామా మాట్లాడుతూ– ‘‘కాశీలోని పరమేశ్వరుని ఆశీస్సులతో అత్యంత ప్రతిష్టాత్మక నవరాత్రి ఉత్సవాల్లో పీటర్ హెయిన్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్సులను షూట్ చేశాం.
హీరో హీరోయిన్లతో పాటు జయప్రకాశ్, సూర్య, అశుతోష్ రాణా, పవిత్రా లోకేశ్ తదితరులపై ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా తీశాం. ఓ విభిన్న చిత్రమిది’’ అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా.