విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐయస్‌ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనేది ‘ఎఫ్‌ఐఆర్’ మూలకథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment