స్వయంభూలో ఎంట్రీ | Nabha Natesh is on sets now for Swayambhu | Sakshi
Sakshi News home page

స్వయంభూలో ఎంట్రీ

Published Fri, Apr 5 2024 4:35 AM | Last Updated on Fri, Apr 5 2024 12:37 PM

Nabha Natesh is on sets now for Swayambhu - Sakshi

‘కార్తికేయ 2’తో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న నిఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభూ’. ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు హీరోయిన్‌ నభా నటేష్‌. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్త ఓ కథానాయికగా నటిస్తుండగా, నభా నటేష్‌ కీలకమైన, శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ పాన్‌ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీకరణలో నభా నటేష్‌ గురువారం జాయిన్‌ అయిన విషయాన్ని ప్రకటించి, ఆమె పోస్టర్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘స్వయంభూ’ చిత్రంలో ఓ లెజెండరీ యోధుడిగా నిఖిల్‌ నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం మార్షల్‌ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో ట్రైనింగ్‌ తీసుకున్నారాయన. నభా నటేష్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా ఆమె మారిన విధానం అద్భుతం’’ అన్నారు మేకర్స్‌. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్, సహ నిర్మాతలు: విజయ్‌ కామిశెట్టి, జీటీ ఆనంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement