చందూ మొండేటి దర్శకత్వంలో హీరో నిఖిల్ నటించిన చిత్రం 'కార్తికేయ2' విడుదలై ఏడాది పూర్తి అయింది. అందుకు గుర్తుగా చిత్ర యూనిట్ తాజాగ పార్టీని ఏర్పాటు చేసింది. ఆందులో డైరెక్టర్ చందూ మొండేటితో పాటు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టడంతో పార్ట్ 3 కూడా ఉండబోతుందనే వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై అఫిషీయల్‌గా కార్తికేయ3 కథ రెడీ చేశామని త్వరలో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డైరెక్టర్ చందూ మొండేటి ప్రకటించారు.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్)
ఈ ప్రకటనే వారికి ఇబ్బందులు తెచ్చాయని తెలుస్తోంది. 2014లో కార్తికేయ సినిమా విడుదలై అప్పుడు సూపర్ హిట్ అయింది. కానీ అప్పట్లో రిలీజ్ సమయంలో చిత్ర యూనిట్‌కు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చాయట. ఆ సమయంలో వారికి 'భమ్ భోలేనాథ్' సినిమా నిర్మించిన సిరువూరి రాజేష్ వర్మ అనే నిర్మాత ఫైనాన్స్ చేసి రిలీజ్‌కు సాయం చేశారట. ఆప్పుడు ఆయన కార్తికేయ ఫ్రాంచైజ్ హక్కులు అగ్రీమెంట్స్ ద్వారా తీసుకున్నారట.
(ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్ హీరోయిన్)
కానీ కార్తికేయ 2 విడుదల సమయంలో నిఖిల్‌తో ఆయనకున్న రేలేషన్‌తో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా NOC ఇచ్చారట. అందుకు గాను ఆ సినిమాలో రాజేష్‌కు థాంక్స్ కార్డు కూడా వేశారు. తాజాగ కార్తికేయ 3 విషయంలో తనకు మాట మాత్రం చెప్పకుండా ప్రకటన చెయ్యడమే కాకుండా ఇంకో ప్రొడ్యూసర్‌తో మూవీ చెయ్యడానికి రెడీ అయిపోవడంతో రాజేష్ అభ్యంతరం తెలుపుతున్నాడట. తన ప్రమేయం లేకుండా ఈ ప్రాజెక్ట్‌పై ఎవరైనా ముందుకు వెళ్తే అన్ని లీగల్ నోటీసులు జారీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారట.
Comments
Please login to add a commentAdd a comment