Nikhil Karthikeya 2 Movie Expected OTT Release Date, Check Streaming Platform - Sakshi
Sakshi News home page

Karthikeya 2 OTT Release: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..

Published Mon, Sep 12 2022 6:58 PM | Last Updated on Mon, Sep 12 2022 7:29 PM

Is Nikhil Karthikeya 2 Movie OTT Premiere On ZEE5 Soon - Sakshi

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న లేటెస్ట్‌ చిత్రం ‘కార్తికేయ 2’. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌లు జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈమూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలకు ఆదరణ కురువైన నేపథ్యంలో తెలుగు చిన్న సినిమా అయిన కార్తికేయ 2 బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద అద్భుతమైన కలెక్షన్స్‌ రాబట్టింది.

చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?

ఇప్పటికీ థియేటర్లో కార్తీకేయ 2 సందడి చేస్తోంది. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 120 కోట్ల గ్రాస్‌ కలెక్ట్‌ చేయగా రూ. 60 కోట్లు షేర్‌ చేసి రికార్డు సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో కలెక్షన్స్‌ చేసింది. బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచిన ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. కాగా ఏ చిత్రంమైన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: కృష్ణంరాజుకు జయప్రద నివాళి.. వెక్కెక్కి ఏడ్చిన నటి

ఈ మూవీ థియేటర్లో విడుదలైన నెల రోజులు కావోస్తున్న నేపథ్యంలో కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్‌కు ముస్తాబవుతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్‌ భారీ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని వినికిడి. ఇక త్వరలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్‌ కానుందట. మరోవైపు సెప్టెంబర్‌ 30 నుంచే కార్తికేయ 2 అన్ని భాషల్లో అందుబాటులోకి రానుందని కూడా అంటున్నాయి సినీవర్గాలు. దీనిపై జీ5 త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందని సమాచారం. కాగా టి.జి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రం బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement