Actor Vijay Raghavendra Emotional Comments About His Wife Spandana Support, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Actor Vijay Raghavendra: స్పందన మృతి.. నూరేళ్లు కలిసుందామంటూ ఏడ్చిన నటుడు, వీడియో వైరల్‌

Published Tue, Aug 8 2023 11:19 AM | Last Updated on Tue, Aug 8 2023 12:00 PM

Actor Vijay Raghavendra Emotional Comments About His Wife Spandana Support, Video Goes Viral - Sakshi

కన్నడ నటుడు, సింగర్‌ విజయ్‌ రాఘవేంద్ర సతీమణి స్పందన గుండెపోటుతో కన్నుమూసింది. బ్యాంకాక్‌లో విహారయాత్రకు వెళ్లిన ఆమె ఆగస్టు 7న ఉదయం తుదిశ్వాస విడిచింది. స్పందన మరణంతో రాఘవేంద్రరావు కుటుంబంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. భార్యను ప్రాణంగా ప్రేమించే విజయ్‌కు దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌తో విశాల్‌ పెళ్లి ఫిక్స్‌ !)

వీరిద్దరూ జంటగా ఓ షోలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దాదాపు రెండు నెలల క్రితం రాఘవేంద్ర తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నాడు. తను జీవితంలో పడ్డ కష్టాలను, తన కుటుంబం అందించిన సపోర్ట్‌ను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్య చేయిని పట్టుకుని.. 'ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ చేయి  విడవద్దు. వందేళ్లపాటు కలిసి ప్రయాణిద్దాం' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూస్తుంటే తమ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయంటున్నారు అభిమానులు.

కాగా విజయ్‌ రాఘవేంద్ర సుమారు 50 సినిమాల్లో నటించడమే కాకుండా 20కు పైగా పాటలు పాడారు. ఆ మధ్య బిగ్‌బాస్‌ షోలోనూ కనిపించారు. స్పందనను ప్రేమించిన ఆయన 2007లో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. వీరికి శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. స్పందన సైతం పలు చిత్రాల్లో నటించగా భర్త రాఘవేంద్ర నటించిన కొన్ని మూవీస్‌కు నిర్మాతగానూ వ్యవహరించింది.

చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement