vijay Raghavendra
-
భూమి ఉన్నంత వరకే రాజు
‘సూడుండయ్యా... రైతు భూమి ఉన్నంతవరకే రాజు. ఒక్కసారి ఆ భూమి అమ్ముకున్నామా.. అదే భూమికి కూలీలమైపోతాం’ అనే డైలాగ్‌తో విడుదలైంది ‘‘111 గ్రీన్ జోన్’ సినిమా కాన్సెప్ట్ టీజర్. సినిమా బండి క్రియేషన్స్, యుపిక్ క్రియేషన్స్ పతాకాలపై విజయ రాఘవేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శనివారం ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ రాఘవేంద్ర మాట్లాడుతూ– ‘‘మంచి ఉద్దేశంతో తీసిన చిత్రం ‘111 గ్రీన్‌జోన్’. మంచి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కంటెంట్ పరంగా ‘111 గ్రీజ్ జోన్’ మూవీ చాలా ప్రత్యేకమైనది. మన సంస్కృతితో ముడిపడిన చిత్రం ఇది’’ అన్నారు సంగీత దర్శకుడు లియాండర్ లీ. ఈ కార్యక్రమంలో వీఎఫ్ఎక్స్ చంద్ర, లిరిక్ రైటర్ చిత్రన్ మాట్లాడారు. ∙విజయ రాఘవేంద్ర, ఉదయ్ కుమార్ -
భార్య చేతిలో చెయ్యేసి ఏడ్చేసిన నటుడు.. వీడియో వైరల్
కన్నడ నటుడు, సింగర్ విజయ్ రాఘవేంద్ర సతీమణి స్పందన గుండెపోటుతో కన్నుమూసింది. బ్యాంకాక్‌లో విహారయాత్రకు వెళ్లిన ఆమె ఆగస్టు 7న ఉదయం తుదిశ్వాస విడిచింది. స్పందన మరణంతో రాఘవేంద్రరావు కుటుంబంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. భార్యను ప్రాణంగా ప్రేమించే విజయ్‌కు దేవుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి ఫిక్స్ !) వీరిద్దరూ జంటగా ఓ షోలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. దాదాపు రెండు నెలల క్రితం రాఘవేంద్ర తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నాడు. తను జీవితంలో పడ్డ కష్టాలను, తన కుటుంబం అందించిన సపోర్ట్‌ను తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన భార్య చేయిని పట్టుకుని.. 'ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి.. ఎన్ని కష్టాలు వచ్చినా ఈ చేయి విడవద్దు. వందేళ్లపాటు కలిసి ప్రయాణిద్దాం' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ వీడియో చూస్తుంటే తమ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయంటున్నారు అభిమానులు. కాగా విజయ్ రాఘవేంద్ర సుమారు 50 సినిమాల్లో నటించడమే కాకుండా 20కు పైగా పాటలు పాడారు. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ కనిపించారు. స్పందనను ప్రేమించిన ఆయన 2007లో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు. వీరికి శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. స్పందన సైతం పలు చిత్రాల్లో నటించగా భర్త రాఘవేంద్ర నటించిన కొన్ని మూవీస్‌కు నిర్మాతగానూ వ్యవహరించింది. చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రస్టింగ్ కామెంట్స్ This was just 2 months back!💔 ಯಾಕ್ ದೇವ್ರು ಒಳ್ಳೆಯವ್ರಿಗೆ ನೋವು ಕೊಡ್ತಾನೆ? ರಾಘು ಸರ್ ಆ ದೇವ್ರು ನಿಮಗೆ ಈ ನೋವು ಭರಿಸೋ ಶಕ್ತಿ ಕೊಡ್ಲಿ🙏🏻#Spandana #VijayRaghavendra pic.twitter.com/AWzHQrnyBj — Ullas (@Ullasshetty48) August 7, 2023 -
చిత్రసీమలో విషాదం
కర్ణాటక: కన్నడ చిత్రసీమలో విషాదం సంభవించింది. ప్రముఖ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన (41) గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బెంగళూరులోని కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. దంపతులు, వారి కొడుకు థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ విహారానికి వెళ్లిన సమయంలో ఆదివారం రాత్రి గుండెపోటు రాగా తక్షణం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇది తెలిసి విజయ్ రాఘవేంద్ర కుటుంబ సభ్యులు బ్యాంకాక్‌కు వెళ్లారు. విశ్రాంత పోలీసు అధికారి బీకే శివరామ్ కూతురు స్పందన. ఇక కంఠీరవ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గరి బంధువు అవుతారు. 2007లో ప్రేమపెళ్లి 2007లో ఆమెను ప్రేమించి విజయ్ రాఘవేంద్రను పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య అనే కొడుకు ఉన్నాడు. ఈ టూర్లో శివరామ్ కూడా వారి వెంట వెళ్లారు. మృతదేహాన్ని బెంగళూరుకు తరలించి అంత్యక్రియలు చేసే ఏర్పాట్లలో బంధుమిత్రులు నిమగ్నమయ్యారు. అపూర్వ సినిమాలో స్పందన అతిథి పాత్రలో నటించారు. భర్త కోసం నిర్మాతగా మారి కిస్మత్ సినిమాను నిర్మించారు. ఇక రాఘవేంద్ర బాల నటునిగా కన్నడ సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాతగా పేరు గడించారు. ఆమె మృతికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వదంతులు ప్రచారం చేయొద్దు: బీకే హరి శివాజీనగర: స్పందన మరణోత్తర పరీక్ష నివేదిక వచ్చేవరకు ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ కోరారు. సొంత సోదరుడు బీకే శివరామ్ కూతరు స్పందన ఆకస్మిక మరణంతో ఆయన హుటాహుటిన సోదరుని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధకరమైన సంగతి, ఆమె బంధువులతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లింది, సినిమా షూటింగ్ ఉండటంతో విజయ్ రాఘవేంద్ర ఆలస్యంగా వెళ్లి ఆదివారం కలుసుకొన్నారు. రాత్రి నిద్రపోయిన తరువాత లేవకపోవటంతో గుండెపోటు వచ్చిందనుకుని ఆమెను అక్కడి ఆసుపత్రిలో చేర్చగా, మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. సోమవారం శవపరీక్ష జరిగింది, మంగళవారం బెంగళూరుకు తీసుకొచ్చిన తరువాత అంత్యక్రియలు ఎక్కడ చేపట్టాలనేది నిర్ణయిస్తాం. స్పందన ముందు నుంచి కూడా బలహీనంగా ఉండేది అని చెప్పారు. తరువాత ఆయన బంధువులతో కలిసి బ్యాంకాక్‌కు బయల్దేరారు. -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?
ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటీస్ కారణమా? ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెనొప్పి సంకేతాలు ఇలా గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది. మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి. తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు. రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతిలోనే.. ►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి ► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం ► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చూసుకోవాలి -
నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మృతి
-
పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో విషాదం.. గుండెపోటుతో స్పందన మృతి
కన్నడ ప్రముఖ నటుడు,సింగర్ విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన మరణించారు. కుటుంబంతో కలిసి బ్యాంకాక్‌కు విహారయాత్రకు వెళ్లిన స్పందన అక్కడ గుండెపోటుతో మరణించారు. ఆమె ఆకస్మిక మరణ వార్తతో కుటుంబ సభ్యులతో పాటు శాండల్‌వుడ్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు. 2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచి స్పందన మరణించడం చాలా బాధాకరమైన సంఘటననే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) ఈ నెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకుంది. 2007లో విజయ్ రాఘవేంద్రను ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శౌర్య అనే కుమారుడు ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన జంటకు శాండల్‌వుడ్‌లో భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. తన భర్త సినిమాలకు స్పందననే నిర్మాతగా ఉండి పలు సినిమాలను కూడా నిర్మించింది. తుళు కుటుంబానికి చెందిన స్పందన మాజీ పోలీసు అధికారి శివరామ్ కుమార్తె. 2017లో విడుదలైన రవిచంద్రన్ చిత్రం అపూర్వలో కూడా ఆమె అతిధి పాత్ర పోషించింది. స్పందన భౌతికకాయం రేపటిలోగా బెంగళూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. శాండల్‌వుడ్‌లో పాపులర్ యాక్టర్ అయిన స్పందన భర్త విజయ్ రాఘవేంద్ర నటించిన 'చిన్నారి ముఠా' సినిమాతో జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. అక్కడి పరిశ్రమలో ఆయన సుమారు 50 సినిమాలకు పైగా నటించగా 20కు పైగా పాటలు పాడారు. ప్రస్తుతం పలు టీవీ షోలలో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దిగ్భ్రాంతికి గురి చేసింది: కర్ణాటక ముఖ్యమంత్రి ప్రముఖ కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య స్పందన అకాల మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. స్పందనను కోల్పోయిన విజయ రాఘవేంద్ర, బికె శివరామ్‌ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. -
పెద్ద సైతాన్
విజయ్ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రణతంత్ర’. ఎస్. రమేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ వెంకట్రావ్ మార్టోరి ‘ఇది పెద్ద సైతాన్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. వెంకట్రావ్ మాట్లాడుతూ – ‘‘లవ్ అండ్ యాక్షన్ రొమాంటిక్ హారర్ మూవీ ఇది. తెలుగులో వచ్చిన హారర్ సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి. మా చిత్రం కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల చేస్తాం. అలాగే మా బ్యానర్లో ‘మహాబలి’, గోలీసోడా’ వంటి చిత్రాల్ని కూడా రిలీజ్ చేస్తున్నాం. పెద్ద స్టార్ కాస్టింగ్‌తో తెలుగులో దసరాకి స్ట్రెయిట్ సినిమాను ప్రారంభించనున్నాం’’ అన్నారు.