పెద్ద సైతాన్‌ | Idi Pedda Saithan Love action and Romantic Horror Movie | Sakshi
Sakshi News home page

పెద్ద సైతాన్‌

Published Mon, Jul 24 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

పెద్ద సైతాన్‌

పెద్ద సైతాన్‌

విజయ్‌ రాఘవేంద్ర, హరిప్రియ జంటగా ఆదిరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రణతంత్ర’. ఎస్‌. రమేశ్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ జె.వి. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్‌ వెంకట్రావ్‌ మార్టోరి ‘ఇది పెద్ద సైతాన్‌’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

వెంకట్రావ్‌ మాట్లాడుతూ – ‘‘లవ్‌ అండ్‌ యాక్షన్‌ రొమాంటిక్‌ హారర్‌ మూవీ ఇది.  తెలుగులో వచ్చిన హారర్‌ సినిమాలు పెద్ద సక్సెస్‌ అయ్యాయి. మా చిత్రం కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఆగస్టు 4న ఈ సినిమా విడుదల చేస్తాం. అలాగే మా బ్యానర్‌లో ‘మహాబలి’, గోలీసోడా’ వంటి చిత్రాల్ని కూడా రిలీజ్‌ చేస్తున్నాం. పెద్ద స్టార్‌ కాస్టింగ్‌తో తెలుగులో దసరాకి స్ట్రెయిట్‌ సినిమాను ప్రారంభించనున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement