Kannada actor Vijay Raghavendra's wife Spandana dies at 41 - Sakshi
Sakshi News home page

చిత్రసీమలో విషాదం

Published Tue, Aug 8 2023 12:30 AM | Last Updated on Wed, Aug 9 2023 3:29 PM

- - Sakshi

కర్ణాటక: కన్నడ చిత్రసీమలో విషాదం సంభవించింది. ప్రముఖ నటుడు విజయ్‌ రాఘవేంద్ర భార్య స్పందన (41) గుండెపోటుతో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న బెంగళూరులోని కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. దంపతులు, వారి కొడుకు థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌ విహారానికి వెళ్లిన సమయంలో ఆదివారం రాత్రి గుండెపోటు రాగా తక్షణం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇది తెలిసి విజయ్‌ రాఘవేంద్ర కుటుంబ సభ్యులు బ్యాంకాక్‌కు వెళ్లారు. విశ్రాంత పోలీసు అధికారి బీకే శివరామ్‌ కూతురు స్పందన. ఇక కంఠీరవ రాజ్‌కుమార్‌ కుటుంబానికి విజయ్‌ రాఘవేంద్ర దగ్గరి బంధువు అవుతారు.

2007లో ప్రేమపెళ్లి
2007లో ఆమెను ప్రేమించి విజయ్‌ రాఘవేంద్రను పెళ్లి చేసుకున్నారు. వీరికి శౌర్య అనే కొడుకు ఉన్నాడు. ఈ టూర్‌లో శివరామ్‌ కూడా వారి వెంట వెళ్లారు. మృతదేహాన్ని బెంగళూరుకు తరలించి అంత్యక్రియలు చేసే ఏర్పాట్లలో బంధుమిత్రులు నిమగ్నమయ్యారు. అపూర్వ సినిమాలో స్పందన అతిథి పాత్రలో నటించారు. భర్త కోసం నిర్మాతగా మారి కిస్మత్‌ సినిమాను నిర్మించారు. ఇక రాఘవేంద్ర బాల నటునిగా కన్నడ సినీ రంగ ప్రవేశం చేశారు. నటుడు, దర్శకుడు, టీవీ వ్యాఖ్యాతగా పేరు గడించారు. ఆమె మృతికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

వదంతులు ప్రచారం చేయొద్దు: బీకే హరి
శివాజీనగర:
స్పందన మరణోత్తర పరీక్ష నివేదిక వచ్చేవరకు ఊహాగానాలు ప్రచారం చేయవద్దని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్‌ కోరారు. సొంత సోదరుడు బీకే శివరామ్‌ కూతరు స్పందన ఆకస్మిక మరణంతో ఆయన హుటాహుటిన సోదరుని నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఇది చాలా బాధకరమైన సంగతి, ఆమె బంధువులతో కలిసి బ్యాంకాక్‌కు వెళ్లింది, సినిమా షూటింగ్‌ ఉండటంతో విజయ్‌ రాఘవేంద్ర ఆలస్యంగా వెళ్లి ఆదివారం కలుసుకొన్నారు. రాత్రి నిద్రపోయిన తరువాత లేవకపోవటంతో గుండెపోటు వచ్చిందనుకుని ఆమెను అక్కడి ఆసుపత్రిలో చేర్చగా, మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.

సోమవారం శవపరీక్ష జరిగింది, మంగళవారం బెంగళూరుకు తీసుకొచ్చిన తరువాత అంత్యక్రియలు ఎక్కడ చేపట్టాలనేది నిర్ణయిస్తాం. స్పందన ముందు నుంచి కూడా బలహీనంగా ఉండేది అని చెప్పారు. తరువాత ఆయన బంధువులతో కలిసి బ్యాంకాక్‌కు బయల్దేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement