ఆనేకల్.. అవినీతి హల్‌చల్
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలో ఉన్న ఆనేకల్ పట్టణ తాలూకా పంచాయతీ ఆఫీసు ముందు కర్ణాటక రిపబ్లికన్ సేనె నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. తాలూకాఫీసులో లంచాలు, అవినీతి విచ్చలవిడి సాగుతున్నాయని ఆరోపించారు. ఆనేకల్ తాలూకాలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీలలో అవినీతి యథేచ్ఛగా జరుగుతోందని, ఆఫీసుల్లో పేదలకు ఎలాంటి పనులు జరగడం లేదని అన్నారు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పేదలను చెప్పులు అరిగేలా తిప్పుతున్నారని, లంచాలకు అలవాటు పడిన అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే పనులు చేయడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా ఆనేకల్ తాలూకాఫీసులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్దపీట వేస్తూ, సామాన్య ప్రజలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే పురసభలు, గ్రామ పంచాయతీలలో పౌర కార్మికులకు, డీ గ్రూప్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, వేతనాలను పెంచాలని కోరారు. జిగని శంకర్, యల్లప్ప, చిన్నప్ప, మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment