విహారానికి వెళ్లి అదృశ్యం
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అటవీ ప్రాంతంలో రిసార్టు నుంచి బయటకు వెళ్లిన ఓ కుటుంబం అదృశ్యమైంది. బెంగళూరుకు చెందిన జె.నిశాంత్ (40), అతని భార్య చందన (35), వారి పదేళ్ల కుమారుడు కనిపించకుండాపోయారు. వివరాలు.. బండీపుర సమీపంలోని కంట్రీక్లబ్ రిసార్ట్‌లో ఈ కుటుంబం ఆదివారం రాత్రి బస చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. నిశాంత్ లగేజ్ రిసార్ట్‌లోనే ఉంది. రిసార్ట్‌లో లగేజీని వదిలి ముగ్గురు కారులో బయటకు వెళ్లారు. బండీపుర మంగళ రోడ్డు వరకు వెళ్లినవారు అక్కడి నుంచి కనిపించకుండాపోయారు. జిల్లా ఎస్పీ డాక్టర్ బీటీ కవిత స్థలాన్ని పరిశీలించారు. గుండ్లుపేటె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
నకిలీ ఐడీతో గది బుక్
నిశాంత్ బీబీఎంపీ ఉద్యోగి అని చెప్పుకుని నకిలీ ఐడీని అందించి గదిని బుక్ చేసుకున్నారు. నిశాంత్ భారీగా అప్పులు చేశాడని, ప్రస్తుతం ఏ పనీ చేయడం లేదని తెలిసింది. అప్పులిచ్చిన వారి వేధింపులకు భయపడి కుటుంబంతో కలిసి బండీపురకు వచ్చాడు. రుణదాతలు అపహరించి ఉంటారనే అనుమానంతో పోలీసులు గాలింపు చేపట్టారు. తమిళనాడు, కేరళ, మైసూరుతో పాటు పలు చోట్ల గాలిస్తున్నారు.
కంట్రీక్లబ్ రిసార్టు, మిస్సయిన చోట పోలీసుల తనిఖీ
బెంగళూరు కుటుంబం గుండ్లుపేటె వద్ద మిస్సింగ్
అప్పులవాళ్లు కిడ్నాప్ చేశారని అనుమానాలు
Comments
Please login to add a commentAdd a comment