తోట ఇంటిలో హత్యాకాండ
మైసూరు: గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో బాది వృద్ధ దంపతులను హత్య చేసిన ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకా నాడప్పనహళ్లిలో మంగళవారం జరిగింది. గ్రామ నివాసులైన రంగస్వామిగౌడ (65), అతని భార్య శాంతమ్మ (52) హతులు.
వివరాలు.. ఈ దంపతులకు గ్రామ పంచాయతీ సభ్యుడు దేవరాజ్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిద్దరే తోట ఇంట్లో నివాసం ఉంటున్నారు. దేవరాజ్ తన పొలంలో సొంఠిని నింపేందుకు బుట్టలు తీసుకు రమ్మని గణేష్ అనే కార్మికున్ని తోట ఇంటికి పంపాడు. అతడు వచ్చి చూడగా ఇంటిలో శాంతమ్మ మృతదేహం, పశువుల కొట్టంలో రంగస్వామిగౌడ శవం రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కేకలు వేస్తూ పరుగులు తీశాడు. దేవరాజ్ వెంటనే వచ్చి బిళికెరె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్‌స్పెక్టర్ లోలాక్షి, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాల కోసం గాలించారు. ఈ హత్యాకాండతో గ్రామంలో భయాందోళన నెలకొంది. దక్షిణ వలయ ఐజీపీ బోరలింగయ్య, ఎస్పీ విష్ణువర్ధన్, డీఎస్పీ గోపాలకృష్ణ తోట ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. హంతకులు ఎవరు, ఎందుకు చంపారు అనేది మిస్టరీగా ఉంది.
కడతేరిన రైతు దంపతులు
మైసూరు జిల్లాలో ఘోరం
తోట ఇంటిలో హత్యాకాండ
Comments
Please login to add a commentAdd a comment