టమాటా సాస్.. ఆరోగ్యం లాస్
బనశంకరి: ప్లాస్టిక్ కవర్లు పెట్టి ఇడ్లీలు చేయడం, కూరగాయలు తాజాగా కనిపించేలా రంగులు వేయడం వద్దని సర్కారు ఇటీవల హెచ్చరించింది. ఇప్పుడు టమాటా సాస్ ప్రమాదకరమని
రాష్ట్ర ఆహార సురక్షతా శాఖ నివేదికను విడుదల చేసింది. వీధి బండ్ల నుంచి ప్రముఖ రెస్టారెంట్ల వరకు టమాటా సాస్‌లను వాడుతుంటారు. ఇందులో బ్రాండెడ్ ఉత్పత్తులు వాడేవారు తక్కువ. టేబుళ్లపై కూడా ఉంచడం వల్ల వినియోగదారులు అదనంగా చల్లుకుంటారు. కానీ టమాటా సాస్‌లో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు ఆహార సురక్షతా శాఖ నివేదికలో హెచ్చరించింది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదమని తెలిపింది.
అధిక మొత్తంలో ఉప్పు, రసాయనాలు
పెద్దల్లో బీపీ, పిల్లల్లో మానసిక అలజడి
ఆహార సురక్షత శాఖ నివేదిక
రసాయనాలు, కృత్రిమ రంగులు
మార్కెట్లో నాసిరకం టమాసా సాస్ సరఫరా అవుతోందని ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేశారు. ఫిబ్రవరిలో శాంపిల్స్ సేకరించిన ల్యాబ్‌లలో పరీక్షించారు.
సాస్‌లో సోడియం బెంజోయేట్ అనే రసాయం మితిమీరి వాడుతున్నారని, ఉప్పు ఎక్కువ మొత్తంలో ఉందని గుర్తించారు.
ఎర్రగా నిగనిగలాడుతూ కనబడటానికి కృత్రిమ రంగులు వాడుతున్నారు. ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు తెలిపారు.
పెద్దల్లో బీపీ పెరగడం, నిస్సత్తువ, పిల్లల్లో కోపం, ఉద్రేకం వంటివి కలుగుతాయి. మానసిక అలజడి పెరుగుతుందని హెచ్చరించారు.
సాస్ మాత్రమే కాదు బెల్లం, చిప్స్, బఠాణీలు కల్తీ అవుతున్నట్లు చెప్పారు.
టమాటా సాస్.. ఆరోగ్యం లాస్
Comments
Please login to add a commentAdd a comment