
సాక్షి, సీతంపేట : వారంతా ప్రభుత్వ ఉన్నతాధికారులు. ప్రజల సమస్యలు తమకెందుకు అనుకున్నారేమో ! నిర్లక్ష్యంగా చిన్నపాటి కునుకు తీశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమంలో అధికారులు ఇలా చేయడం గమనార్హం. గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ ఐటీడీఏ పీవో సాయికాంత్‌వర్మ బిజీగా ఉండగా అధికారులు మాత్రం ఎవరూ చూడరు అనుకున్నారో లేక తమకేం పని అనుకున్నారో కాసేపు కునుకు తీశారు...మరికొందరు సెల్‌ఫోన్‌లతో బిజీ అయిపోయారు. ఇది సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన స్పందనలో అధికారుల పనితీరు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణలు.
Comments
Please login to add a commentAdd a comment