officer neglect
-
కుక్క ఫోటోతో ఓటరు గుర్తింపు కార్డు
ముర్షిదాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఓ వ్యక్తి ఓటర్ గుర్తింపు కారర్డులో వ్యక్తి ఫోటోకి బదులు కుక్క బొమ్మతో కార్డు జారీ చేయడం కలకలం రేపింది. ముర్షిదాబాద్‌కు చెందిన సునీల్ కర్మాకర్ పుట్టిన తేదీలో తప్పు దొర్లగా దాన్ని సరిదిద్దాలని జనవరి 8న దరఖాస్తు చేసుకున్నాడు. ఈసీ జారీ చేసిన గుర్తింపు కార్డులో తన ఫోటోకు బదులు కుక్కను ముద్రించడంపై సునీల్ కర్మాకర్ మండిపడుతున్నారు. మనిషినైన తన స్ధానంలో ఈసీ ఓ జంతువు ఫోటోను ప్రచురించడం తనను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఓటరు కార్డును బుధవారం తనకు అందించగా తన ఫోటో స్ధానంలో కుక్క బొమ్మ ఉండటాన్ని గుర్తించానని, ఈ విషయం సదరు అధికారి గుర్తించలేదని, ఇది తన గౌరవంతో చెలగాటమాడటమేనని కర్మాకర్ వాపోయారు. తాను బీడీఓ కార్యాలయానికి వెళ్లి మరోసారి ఇలా జరగకూడదని అధికారులను కోరానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది పొరపాటుగా జరిగిందని ఫరక్కా బీడీఓ రాజర్షి చక్రవర్తి అంగీకరించారు. కర్మాకర్‌కు సరైన ఫోటోతో నూతన ఓటరు కార్డును త్వరలో జారీ చేస్తామని చెప్పారు. చదవండి : బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు: సీఈసీ -
సారూ! మరీ ఇంత నిర్లక్ష్యమా..
సాక్షి, సీతంపేట : వారంతా ప్రభుత్వ ఉన్నతాధికారులు. ప్రజల సమస్యలు తమకెందుకు అనుకున్నారేమో ! నిర్లక్ష్యంగా చిన్నపాటి కునుకు తీశారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్పందన కార్యక్రమంలో అధికారులు ఇలా చేయడం గమనార్హం. గిరిజనుల నుంచి అర్జీలను స్వీకరిస్తూ ఐటీడీఏ పీవో సాయికాంత్‌వర్మ బిజీగా ఉండగా అధికారులు మాత్రం ఎవరూ చూడరు అనుకున్నారో లేక తమకేం పని అనుకున్నారో కాసేపు కునుకు తీశారు...మరికొందరు సెల్ఫోన్లతో బిజీ అయిపోయారు. ఇది సీతంపేట ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన స్పందనలో అధికారుల పనితీరు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఈ దృశ్యాలే ఉదాహరణలు. -
పరిష్కారానికి పది నిమిషాలు చాలు
లింగంపేట, న్యూస్‌లైన్ : సమస్య చిన్నదే.. పట్టించుకుంటే పది ని మిషాల్లోనే తీరిపోతుంది. అధికారుల నిర్లక్ష్యంతో పరిష్కారానికి నోచుకోక తండావాసుల పాలిట పెద్ద కష్టంగా మారింది. గొంతు తడుపుకోవాలంటే పంటలకు పారించే నీటిపంపు దగ్గరికి పోవాల్సిందే. అక్కడా కరెంటు ఉంటేనే నీళ్లు దొరుకుతాయి. తాగునీటి కోసం కరెంటు వచ్చీపోయే సమయాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. పొద్దునా.. రాత్రి.. అనే తేడా లేదు. ఎప్పుడు కరెంటు వస్తే అప్పుడు బిందెలు పట్టుకుని పంటచేళ్లకు పరుగెత్తాల్సిందే. తండాకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్ద నుంచి నీళ్లను తెచ్చుకోవాల్సిందే. లింగంపేట మండలం మోతె గ్రామపంచాయతీ పరిధిలోని బట్టిప్పగడ్డ తండావాసులు రెండేళ్లుగా తాగునీటి కోసం తిప్పలు పడుతూనే ఉన్నారు. రెండేళ్లుగా తాగునీటి కోసం బట్టిప్పగడ్డ తండాలో వేసిన బోరుమోటార్ రెండేళ్ల కిందట కాలిపోయింది. అప్పటి నుంచి మరమ్మతులు చేయించాలని తండావాసులు అధికారులకు, పాలకులకు చెబుతూనే ఉన్నారు. కానీ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మారుమూల తండా కావడంతో ఉన్నతాధికారులు సైతం ఈ వైపు కన్నెత్తి చూడటం లేదు. బోరు మోటారు పనిచేయక పోవడంతో మంచినీటి ట్యాంకు నిరుపయోగంగా మారింది. వ్యవసాయ బావులే దిక్కు అధికారులు, పంచాయతీ పాలకులు కాలిన బోరుమోటారుకు మరమ్మతు లు చేయించక పోవడంతో గిరిజనులు వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు. తండా సమీపంలోని పంటచేళ్లలో వేసిన బోరుబావుల వద్ద నుంచి నీ టిని తెచ్చుకుంటున్నారు. త్రీఫేజ్ కరెంట్ ఉంటేనే ఆ నీరు దొరుకుతుంది. క రెంట్ లేని సమయంలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. రెండేళ్లుగా తంటాలు పడుతున్నామని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని తండావాసులు కోరుతున్నారు.