సాక్షి, తాడేపల్లి : స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు కోవిడ్ 19 నివారణ, లాక్ డౌన్ అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలపై చర్చ, ఖరీఫ్ సాగుకు సన్నద్ధత, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ పై జిల్లా కలెక్టర్లకు మార్గ నిర్దేశకాలు జారీ చేయనున్నారు. పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం అమలవుతున్న తీరుపై కలెక్టర్లు నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల పని విభజన, వికేంద్రీకరణ, మద్యం, ఇసుక అక్రమ వ్యాపారంపై కొత్తగా ఏర్పడిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విధివిధానాలపై అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు ఉపాధి హామీ అమలు, కూలీలకు వేతనంపై వైఎస్ జగన్ కలెక్టర్లతో చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment