గేట్ కళాశాలలో వర్క్‌షాపు
చిలుకూరు: మండలంలోని గేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఎండ్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ అటోమిషన్ అనే అంశంపై వర్క్ షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపును కళాశాల చైర్మన్ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు వర్క్‌షాపులో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులుకు కళాశాలలో అన్ని హంగులతో వసతులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మైకెల్ ఫారడే పుట్టిన రోజున విద్యార్థులు వర్క్‌షాపు నిర్వహించడం హర్షంచదగిన విషయమన్నారు. వర్క్‌షాపు రెండు రోజుల పాటు జరుగుతుందని ప్రిన్సిపాల్ రామరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నాగేశ్వరరావు, వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.