సాక్షి, హైదరాబాద్: బేగంపేటలోని టూరిజం ప్లాజాలో 'మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్' కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఛైర్మన్‌లు, శాసనమండలి, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ శని, ఆదివారం రెండు రోజులు నిర్వహించనున్నారు. దాదాపు 400 మంది మహిళా జర్నలిస్టులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టుల కొరకు ఒక ప్రత్యేక మీడియా సెంటర్, మీడియా కిట్ సాధించుకోవడంతో పాటు, మహిళా జర్నలిస్టుల సమస్యలు వాటి పరిష్కారాల కొరకు ప్రత్యేక చర్చ ఉంటుందని అల్లం నారాయణ తెలిపారు.
ఏప్రిల్ 24వ తేదీన జరిగే ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వాణి దేవి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి పాల్గొంటారు. ఈ సెషన్ లో జాతీయ స్థాయి మహిళా జర్నలిస్టులు ధన్యా రాజేంద్రన్, మాలిని సుబ్రహ్మణ్యం, 'మీడియా ధోరణులు, జాతీయ పరిస్థితులు' అనే అంశంపై ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment